| IND vs NZ: తడబడ్డ భారత టాప్ ఆర్డర్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?
IND vs NZ
స్పోర్ట్స్

IND vs NZ: తడబడ్డ భారత టాప్ ఆర్డర్.. కివీస్ లక్ష్యం ఎంతంటే?

IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మోస్తరు స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత టాప్ ఆర్డర్ విఫలమైనా శ్రేయస్, అక్షర్, హార్దిక్ పాండ్యా రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

రోహిత్, కోహ్లీ విఫలం

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ కు సరైన ఓపెనింగ్ లభించలేదు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి.. గిల్ (2) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ లో రోహిత్ (15) సైతం ఔట్ అయ్యాడు. ఆపై వచ్చిన కోహ్లీ కూడా 11 పరుగులకే వెనుదిరగడంతో భారత్.. 30 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 79 (98) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్  42 (61)తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 45 (45) మెరవడంతో భారత్ 249-9 స్కోర్ చేయగలిగింది. మిగిలిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (23), రవీంద్ర జడేజా (16) పర్వాలేదనిపించారు. అటు కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. కైల్ జెమీసన్, విలియం ఓరుర్కే, శాంట్నర్, రచిన్ రవీంద్ర.. తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో కివీస్ విజయం సాధించాలంటే 250 పరుగులు అవసరం.

Also Read: Blue Ghost: అంతరిక్షంలో కొత్త చరిత్ర.. జాబిల్లిని ముద్దాడిన ‘బ్లూ ఘోస్ట్’

 

 

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?