rahul-delhi
స్పోర్ట్స్

KL Rahul: రాహుల్ ..ఢిల్లీకి చేరినా.!

KL Rahul: పాపం కేఎల్ రాహుల్.. టీమిండియాలో ఎక్కడ ఆడమన్నా ఆడుతాడు.. ఓపెనర్ నుంచి ఆరోస్థానం వరకు.. ఫార్మాట్ ఏదైనా సరే..బరిలోకి దిగేందుకు రెడీ..ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అతని స్థానం ఎక్కడో ఎవరికీ తెలియదు.. ఓపెనర్ గానా లేదంటే మూడోస్థానమా..? లేదంటే ఆరోస్థానమా..? అంటే చెప్పలేం. అట్లా ఉంది.. మరి పరిస్థితి.

గతంలో లక్నో కెప్టెన్ గా ఉన్న సమయంలో ఓనర్ గోయెంకా గ్రౌండ్ లోనే తిట్టడం.. ఆ తర్వాత రాహుల్ ఆ ఫ్రాంచైజీ వీడడం.. ఈ సీజన్ కు ఢిల్లీ క్యాపిటల్స్ తో చేరడం.. ఇవన్నీ జరిగాయి. కానీ గతంలో గాయాల నుంచి కోలుకుని మళ్లీ టీమిండియాలో చేరేముందు రాహుల్ కు ఎన్నో కఠిన పరీక్షలు ఎదురయ్యాయి. వన్డేలో కీపర్ గా ..టెస్టుల్లో ఓపెనర్  అవతారమెత్తాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో అతను నెమ్మదిగా ఆడడంతో ట్రోల్స్ కు గురయ్యాడు. ఇలా అన్నీ కష్టాలే..

కానీ ఆస్ట్రేలియాలో జరిగిన  బిజిటిలో అతను రాణించడం.. అనంతరం ఇంగ్లండ్ తో వన్డే సిరీస్.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో విజయంలో కీలకపాత్ర. దీంతో రాహుల్ పై ఒత్తిడి తగ్గింది. ఇక ఐపీఎల్ లో తనకిష్టమైన ఓపెనింగ్ స్థానంలో దిగుతాడని అనుకుంటే ..ఇక్కడా ప్రాబ్లెమ్ వచ్చింది.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో  ముగ్గురు స్టార్ ఓపెనర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌ కాగా.. ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. గత సీజన్ లో మెక్‌గుర్క్‌ మెరుపు షాట్లతో ఢిల్లీకి మంచి శుభారంభాలు అందించాడు. అతనికి జోడీ డుప్లెసిస్ లేదా రాహుల్ అన్న ప్రశ్న ఎదురౌతోంది. ఇప్పటివరకు  ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు ఎవరనేది మేనేజ్ మెంట్ చెప్పడం లేదు.

ఐపీఎల్ లో మెక్‌గుర్క్‌, డుప్లెసిస్ ఇప్పటివరకు ఓపెనర్లుగానే బ్యాటింగ్ చేయడంతో వీరిద్దరే బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. ఎందుకంటే రాహుల్ మాత్రం ఓపెనర్ గానే కాదు.. మూడు, నాలుగు స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేసి రాణించిన చరిత్ర ఉంది. అందుకే మరోసారి రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలాల్సిందేనంటున్నారు.

ఇప్పటికే ఈ సీజన్ కోసం డుప్లెసిస్ ను వైస్ కెప్టెన్ గా నియమించడంతో అతను తుది జట్టులో ఆడడం ఖాయమే. అందుకే ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్ లో మెక్‌గుర్క్‌, డుప్లెసిస్ ఓపెనర్లుగా దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ భారత జట్టు కోసం ఏ స్థానంలో ఆడించినా ఆడాడు. దీంతో ఈ సీజన్ లో  ఈ స్టార్ బ్యాటర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయొచ్చు.

అంతేకాదు  రాహుల్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. దీంతో జట్టు కోసం మరోసారి తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసేందుకు రాహుల్ రెడీ అయినట్లేనంటున్నారు.

కాగా, ఈ సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  పటిష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్  కూడా ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉంది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను మార్చి 24వ తేదీన  లక్నో సూపర్ జయింట్స్ తో ఆడనుంది.

Also Read: Abhishek Sharma -Travis Head: అభిషేక్ తో హెడేక్..!

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు