abhishek, head
స్పోర్ట్స్

Abhishek Sharma -Travis Head: అభిషేక్ తో హెడేక్..!

Abhishek Sharma -Travis Head: ఓపెనర్లలో ఒక్కడే హిట్టర్ ఉంటే.. అతన్ని ఆపితే సరిపోతుందని అనుకుంటారు.  అతను క్రీజులో లేకపోతే హమ్మయ్య అనుకుంటారు. కానీ ఇద్దరూ హిట్లర్లైతే..ఇద్దరూ బాదుడు బ్యాచ్ అయితే బౌలర్లకు బ్యాండ్ బాజానే. ఇప్పుడు మన సన్ రైజర్స్ టీమ్ ఓపెనర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్ ను చూస్తే అలాగే అనిపిస్తోంది.  ఇద్దరూ ఇద్దరే.. ధనాధన్ షాట్లతో పవర్ ప్లేలోనే స్కోరును వంద దాటించగలరు. బాల్ ఎక్కడ వేసినా వీరి ధాటికి బౌండరీ చేరాల్సిందే. అంతలా చెలరేగుతారు.

ట్రావిస్‌ హెడ్‌ గత సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కండ్లు చెదిరే ఆరంభాలతో ఘన విజయాలు అందించాడు.  ట్రావిస్‌ హెడ్‌తో కలిసి అభిషేక్‌ శర్మ గత సీజన్‌లో పలు అద్భుత ఓపెనింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సన్‌ రైజర్స్‌ విజయాల్లో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయస్థాయిలో ట్రావిస్ హెడ్ ఎంతలా రాణిస్తాడో.. ఓపెనర్ గా ఎంత విధ్వంసం సృష్టిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గత సీజన్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున  ట్రావిస్ హెడ్  అదరగొట్టాడు.  గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 250కు పైగా పరుగులను రెండుసార్లు చేయడానికి ముఖ్య కారణం అతడేనని చెప్పొచ్చు.. ఈ ఏడాది కూడా దంచి కొట్టాలనే పట్టుదల మీద ఉన్నాడు.

ఇక అభిషేక్ శర్మ కూడా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడింది కొన్ని మ్యాచ్ లైనా.. ఇప్పటికే టీ20 ఫార్మాట్ లో రెండు సెంచరీ లు సాధించాడు. ఇంగ్లండ్ తో ఇటీవల ముగిసిన 5 మ్యాచ్ లటీ20 సిరీస్ లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపాడు. ఓపెనర్ గా అతను కొట్టిన షాట్లకు అందరికీ దిమ్మతిరిగింది.

గత సీజన్ లో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. ఈసారి కూడా దంచి కొట్టేందుకు సిద్ధమయ్యాడు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురిపించగలడు. పవర్ ప్లే మొత్తం క్రీజులో ఉంటే జట్టు స్కోరు సులభంగా 6 ఓవర్లలో 100ను దాటిస్తాడు అభిషేక్.

గత సీజన్ లో విన్నర్ గా నిలిచిన కోల్ కతా జట్టుకు ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్ .. రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ .. సుడిగాలి వేగంతో  భాగస్వామ్యాలు అందించారు. వీరి కొట్టుడికి ప్రతి జట్టూ అల్లాడింది. వీరి బాదుడుకు ప్రతి బౌలర్ బలయ్యాడు. అందుకే ఈ రెండు జట్లూ ఫైనల్ చేరుకున్నాయి.

కానీ ఈ సీజన్ కు మాత్రం కోల్ కతా జట్టు ఓపెనర్లు మారారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మాత్రం ఓపెనర్లిద్దరినీ రిటైన్ చేసుకుంది. అంటే గతేడాది దుమ్మురేపిన వీరిద్దరే ఈ  సీజన్ లోనూ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో డేంజరస్ ఓపెనింగ్ జోడీ గా పేరు తెచ్చుకున్న వీరి దూకుడైన బ్యాటింగ్ అందరికీ తెలిసిందే.

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషాన్ అన్సారీ, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమర్‌జీత్‌ సింగ్, ఈషన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్, వియాన్ ముల్డర్, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అనికేత్ వర్మ.

Also Read: MS Dhoni: ధోనీకి కోపం వస్తే.. కూజాలు చెంబులవుతాయి..

Just In

01

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు