Delhi Capitals Team Members Were Fined Due To Slow Over Rate
స్పోర్ట్స్

IPL 2024 : మ్యాచ్ ఎఫెక్ట్‌..! టీమ్‌ మొత్తానికి ఫైన్‌

Delhi Capitals Team Members Were Fined Due To Slow Over Rate: ఐపీఎల్ 2024 బుధవారం సాయంత్రం విశాఖపట్నం వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ భారీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీనికి తోడు ఆ టీం కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఫైన్ పడింది. స్లో ఓవర్‌ రేట్ కారణంగా రిషబ్‌ ఏకంగా 24 లక్షల ఫైన్‌ చెల్లించాల్సి వస్తోంది. మిగతా ఆటగాళ్లపై కూడా జరిమానా విధించారు. ఒక్కొక్కరు ఆరు లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఐపిఎల్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఇలా జరిమానా చెల్లించడం పంత్‌కు ఇది రెండోసారి. గతంలో కూడా ఓ మ్యాచ్‌లో పంత్‌పై జరిమానా పడింది.

ఇప్పుడు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే విధంగా ఫైన్‌ పడింది. మ్యాచ్‌లో కోల్‌కతా టీం బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే బౌలింగ్ మార్చడం, ఫీల్డింగ్ సరిచేయడానికి పంత్ ఎక్కువ టైం తీసుకున్నారు. దీని కారణంగా ఓవర్లపై ఎఫెక్ట్ పడింది. స్లో ఓవర్‌ రేట్ కారణంగా జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్‌ను కోల్‌కతా బ్యాటర్లు చీల్చి చెండాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 272 రన్స్‌ చేశారు. బ్యాటర్లంతా సిక్సర్స్ ఫోర్లతో రెచ్చిపోయారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్‌ కేవలం 166 రన్స్‌ మాత్రమే చేసింది. మొదటి నుంచి క్రమంగా వికెట్లు పడిపోవడంతో 106 రన్స్‌తో ఓటమిని చవిచూసింది.

Also Read: బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన కుర్రాడు, అందరి చూపు అటువైపే..

ఇందులో పంత్‌తో పాటు ట్రిస్టన్‌ స్టబ్స్‌ మాత్రమే రాణించారు. రిషబ్‌ 25 బంతుల్లో 55 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్‌లో నాలుగు ఫోర్స్‌, ఐదు సిక్లు బాదాడు. స్టబ్స్‌ 32 బంతుల్లో 54 పరుగులు చేశాడు.ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాగులు మ్యాచ్‌లలో మూడింట ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్న ఏకైక జట్టు ముంబై ఇండియన్స్‌. ఢిల్లీ కంటే ఒక్కస్థానం పైన ఉంది రాయల్‌ ఛాలెంజర్స్ ఆఫ్‌ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌లో చెన్నైపైనే విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్