Who Is Kolkata Knight Riders Batsman Angkrish Raghuvamshi: ఐపీఎల‌్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చాలామంది విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ఓపెనర్ సునీల్ నరైన్ నుంచి అందరూ మెరుపులు మెరిపించే వారే. వీరి మధ్యలో ఒక 18 ఏళ్ళ కుర్రాడు ఆంగ్ క్రిష్ రఘువంశీ జట్టులోకి వచ్చేసరికి ఇతడు ఆడగలడా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే అందరికి షాకిస్తూ తన తొలి ఇన్నింగ్స్‌లోనే రఘువంశీ అదరగొట్టాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు.
అనుభవం ఉన్న బ్యాటర్‌లా ఆరి తేరిన ఆటగాడిలా ఢిల్లీ బౌలర్లను చాలా ఈజీగా ఆడేశాడు. 18 ఏళ్ళ వయసులో ఈ కుర్రాడు చూపిన ఆటకు ఫిదా కానివారు బహుశా ఎవరూ ఉండరేమో. గ్రౌండ్ లో అన్ని రకాల షాట్స్ ఆడుతూ ఎంతో పరిణితి చూపించాడు. పవర్ ప్లే లో మెరుపు ఆరంభం లభించినా.. ఎంతో మందిని కాదని నెంబర్ 3లో రఘువంశీకి ప్రమోషన్ ఇచ్చారు. వచ్చిన ఛాన్స్‌ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్ ఎవరా అని మన క్రికెట్ లవర్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
Also Read: ట్రోలింగ్స్ అవసరమా అంటూ రవిశాస్త్రీ ఫైర్
ఇంతకీ ఎవరీ ఆంగ్‌క్రిష్ రఘువంశీ..?
రఘువంశీ ఢిల్లీకి చెందినవాడు. 2005 జూన్ 5న జన్మించాడు. తన చిన్న వయసులో ఐదేళ్ల పాటు ఆసుపత్రుల్లోనే గడిపాడట. దీని కారణం.. ఇతనికి కిషన్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు కిషన్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు. తమ్ముడిని చూసుకుంటూ ఆసుపత్రిలో ఉండటం…అక్కడే నిద్రపోవటం లాంటివి చేస్తూ చిన్న ఏజ్ లోనే చాలా కష్టపడ్డాడంట.
2022లో టీమిండియా అండర్ 19వరల్డ్ కప్ లో రఘువంశీ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 278 పరుగులతో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నీ తర్వాత సీకే నాయుడు ట్రోఫీలోనూ మెరవటంతో కోల్ కతా నైట్ రైడర్స్ రఘవంశీని వేలంలో కొనుక్కుంది. అతని ప్రతిభను ప్రపంచానికి చూపించిన ఘనత మాత్రం మెంటార్ గంభీర్ కే దక్కుతుంది. రఘువంశీ ఫియర్ లెస్ బ్యాటింగ్ ను గమనించిన గంభీర్.. నిన్న ఢిల్లీ మీద వన్ డౌన్ లో పంపించి ఆశ్చర్యపరిచాడు. 18 ఏళ్ల వయసుకే ఐపీఎల్ ఆడుతూ,.. ఆడిన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాది తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.