Ravi Shastri Message To Mumbai Fans Booing Hardik Pandya: ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యను ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడంపై రవిశాస్త్రి ఫైర్ అయ్యాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ టైంలో ఆడియెన్స్ నినాదాలతో హోరెత్తించారు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ముంబయికి అండగా నిలిచారు. కానీ, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినంత మాత్రాన జట్టును తక్కువ చేయడం అస్సలు మంచిది కాదని సూచించాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ అదే. ఇప్పుడు కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగింది. కాస్త ఓపికగా ఉండాలి. పాండ్యను మరీ ట్రోలింగ్ చేయడం చాలా పెద్ద తప్పు. అతడు కూడా మనిషే. రోజు ముగిసిన తర్వాత ఎవరైనా నిద్ర పోవాల్సిందే. కాబట్టి ప్రతిఒక్కరూ కాస్త ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఈ సందర్భంగా పాండ్యకు కూడా ఒక సూచన చేస్తున్నా. ఓపికగా ఉండి గేమ్‌పైనే దృష్టి సారించాలి.
ఆ జట్టులో చాలామంచి ఆటగాళ్లు ఉన్నారు. మరో నాలుగు మ్యాచుల్లో గెలిస్తే చాలు. అంతా సర్దుకుంటుందని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ముంబయి ఆటగాడు ఇషాన్ కిషన్‌కు ఆ జట్టు మేనేజ్‌మెంట్ వినూత్నమైన ఫనిష్‌మెంట్ ఇచ్చింది. అతడితో సూపర్ మ్యాన్ వేషం వేయించింది. అలాగే కుమార్ కార్తికేయ, షామ్స్ ములాని, నువాన్ తుషారాకూ కూడా ఇదే పనిష్‌మెంట్ ఇచ్చారు. ఎందుకు అనేగా మీ డౌటు? వీరంతా జట్టు మీటింగ్‌కు ఆలస్యం వచ్చారని ఇలాంటి శిక్ష విధించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వులు విరిశాయి.
Read Also: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్
ఈ మేరకు ముంబయి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. అందులో నమన్ ధిర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి శిక్షలు ఉంటాయనే తాను మీటింగ్‌కు అస్సలు ఆలస్యంగా రానని వ్యాఖ్యానించాడు. గతంలో నెహాల్ వధేరాకూ ఇలాంటి శిక్ష పడింది. అయితే ఇషాన్‌కు ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఓసారి సమావేశానికి ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్‌తో కలిసి ఆలస్యమయ్యాడు. ఆ టైమ్‌లో తాను మళ్లీ ఎప్పుడూ లేట్ కానని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మరోసారి పనిష్‌మెంట్‌ను ఎదుర్కోవడం విశేషం.