Threat to Gambhir: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులనే టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 27 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా, తాజాగా ఓ స్టార్ క్రికెటర్ కు సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: Southern DPGs Meeting: సైబర్ నేరాల నివారణ కోసం.. దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు ప్రత్యేక సమావేశం!
భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం, టీమిండియా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యహరిస్తున్నారు. ISIS జమ్మూకశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు కాల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. మరో వైపు ఉగ్రవాదుల దాడి పై దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అక్కడి నుంచి గంభీర్ కు బెదిరింపు కాల్ రావడం పై పోలీసులకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు