Cricket Player Sunil Gavaskar Fire On Kkr In IPL: పంజాబ్‌పై 77, కోల్‌కత్తాపై 83, విరాట్ కోహ్లీ చేసిన పరుగులు తొలిమ్యాచ్ మినహా ప్రతి దాంట్లో అతడే టాప్ స్కోరర్. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. గత సీజన్‌లలో అదరగొట్టిన కెప్టెన్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటీదార్‌తో పాటు కొత్తగా వచ్చిన కామెరూన్ గ్రీన్ ప్రదర్శన ఇప్పుడు ఘోరంగా ఉంది. దీంతో బెంగళూరు యూనిట్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇంకెంత కాలం టాప్ ఆర్డర్‌లో విరాట్ ఒక్కడిపైనే జట్టు ఆధారపడుతుందో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. కప్‌ని సాధించాలనే కల నెరవేరాలంటే సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ ఇంకెంతకాలం ఒక్కడే జట్టును లాక్కొని రాగలడు. ఎవరో ఒకరు అతడికి సహకారం అందించాలని బెంగళూరు బ్యాటర్లని ఉద్దేశించి మాట్లాడారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో ఎవరైనా క్రీజ్‌లో ఉండుంటే.. 83 పరుగులు కాకుండా కనీసం 120 రన్స్ చేసేవాడు. క్రికెట్ జట్టుగా ఆడే ఆట. కేవలం ఒక్కరి వల్లే మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించడం కష్టం. కోహ్లీకి సరైన మద్దతు దొరకడం లేదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
Read Also: బ్యాటింగ్ చేయని ధోనీ, రీజన్ ఇదేనన్న కోచ్ మైక్ హుస్సీ..
బెంగళూరు కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ ఆలింగనం చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. గత సీజన్‌లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీని అనంతరం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూశారు. కానీ.. వీరిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రియాక్ట్ అవుతూ.. గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాడు. కోహ్లీ కరచాలనం ఇవ్వడానికి వచ్చినప్పుడు గంభీర్ ముందుకు రావడం అభినందనీయం. ఒక్కోసారి గేమ్‌లో పరిధిని క్రాస్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య జరిగింది కూడా గతమే. ఇప్పుడు వారిద్దరూ ఇలా కలుసుకోవడం బాగుందంటూ పఠాన్ తన మనసులోని మాటను వ్యక్తం చేశాడు.