The reason for Dhoni not Batting: ప్రస్తుతం ఐపీఎల్ 2024 హవానే కంటిన్యూ అవుతోంది. ఈ ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయకపోవడం ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచిన తర్వాత ధోని ఒక్క బంతిని ఎదుర్కోకపోవడానికి గల రీజన్స్‌ని సైతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తాజాగా తెలిపారు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది.
Read Also : రికార్డుల మోత, ఐపీఎల్‌లో సత్తాచాటిన దినేష్ కార్తీక్
శివమ్ దూబే అర్ధసెంచరీ, రచిన్ రవీంద్ర 46 పరుగులతో సీఎస్‌కే విజయంలో తోడ్పడ్డారు.అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌ల కోసం మొదటి రెండు మ్యాచ్‌లలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చక్కర్లు కొడుతోంది.అదే ఎంతోమంది ఫ్యాన్స్ మెచ్చే సారధి ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు ఒక్క బాల్ కూడా ఆడకపోవడమే ఇందుకు మెయిన్ రీజన్. ఇక మంగళవారం యంగ్ క్రికెటర్ సమీర్ రిజ్వీ తన తొలి రెండు బంతులకు సిక్సర్స్ బాది చివరి ఓవర్ మూడో బాల్‌కు ఔట్ అయ్యాడు.అతని తర్వాత అంతా మహేంద్ర సింగ్ ధోనీ వస్తాడని భావించారు. మూడు బంతులు ధోని బ్యాటింగ్ చూడాలనుకునేవారికి సరిపోకపోయినా..ఈ మాజీ కెప్టెన్ వాటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తాడని అందరూ ఆశపడ్డారు. కానీ, వారి ఆశలన్ని అడి ఆశలయ్యాయి. సమీర్ తర్వాత ఏడో స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో ఉండటానికి గల రీజన్స్‌ని తాజాగా సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. ఇంపాక్ట్ రూల్ జట్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించిందని, అందుకే ధోనీ ఆఖరులో వస్తున్నాడని తెలిపారు. ఇప్పటికీ ఒక్క బంతిని కూడా ఎదుర్కోని ధోనీ మంచి బ్యాటింగ్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడని మైక్ హస్సీ పేర్కొన్నారు.
గేమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఆర్డర్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడంతో మాకు ఒక అడిషనల్ బ్యాటర్‌తో పాటు బౌలర్‌ని పొందగలిగాం. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ పొడిగిస్తూనే ఉన్నాం.నెం.8లో ఎంఎస్ ధోనీని ఉంచాం. ఇది చాలా క్రేజీ విషయమే. ఎందుకంటే ఎప్పటిలానే ధోనీ బ్యాటింగ్ మూమెంట్ ఎంతో బాగుందని సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వివరించారు. అలాగే, బ్యాటర్లు వేగంగా ఆడాలని, గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించినట్లు హస్సీ పేర్కొన్నారు.ఒకవేళ ఫెయిలైతే విమర్శించమని కూడా ఆటగాళ్లకు చెప్పినట్లు సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ హస్సీ తెలిపారు. మేము చాలా లోతైన రిసోర్స్ కలిగి ఉన్నాం.
Read Also: సెంచరీలతో క్రికెట్ హిస్టరీ రిపీట్
కాబట్టి, ఆటగాళ్లు ద్వంద్వ ఆలోచనలతో ఉన్నట్లయితే, వారు సానుకూల మార్గాన్ని అనుసరిస్తారని అర్థం. అలాగే ఆటను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి కోచ్‌లు, కెప్టెన్ నుంచి వారికి కచ్చితంగా మద్దతు లభిస్తుంది. ఒకవేళ ఆట నుంచి ఔట్ అయిన పర్వాలేదు. దాని గురించి మేము వారిపై ఎలాంటి విమర్శలు చేయం. ఆటను వేగంగా ఆడటం గురించే ఫ్లేమింగ్ చెబుతుంటాడని హస్సీ అన్నారు.ఇదిలా ఉంటే..చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వైజాగ్‌లో జరగనుండగా..రాత్రి 7.30 గంటలకు షురూ కానుంది. అదే 31న సాయంత్రం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.