BCCI reveals india squad for icc t20 world cup India squad: టీ20 వరల్డ్ కప్‌కు భారత టీం ఇదే.. చాహల్, పంత్ కమ్‌బ్యాక్
BCCI
స్పోర్ట్స్

India squad: టీ20 వరల్డ్ కప్‌కు భారత టీం ఇదే.. చాహల్, పంత్ కమ్‌బ్యాక్

BCCI: జూన్‌లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్‌కు భారత టీం సభ్యులను బీసీసీఐ వెల్లడించింది. అందరూ ఊహించినట్టుగానే ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకుంటారు. వైఎస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. విరాట్ కోహ్లీ, బుమ్రాలు టీమ్‌లో ఉన్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్‌ కోసం భారత్ టీమ్‌ సభ్యులను సెలెక్ట్ చేయడానికి ఈ రోజు గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని హోటల్ ఐటీసీ నర్మదాలో బీసీసీఐ సెక్రెటరీ జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భేటీ అయ్యారు. రోహిత్ శర్మ కూడా వర్చువల్‌గా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలిసింది. మొత్తం 15 మంది సభ్యులను ఎంపిక చేశారు.

అందరూ ఊహించినట్టుగానే వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. సెకండ్ చాయిస్‌ వికెట్ కీపర్‌గా సంజు సామ్సన్‌కు అవకాశం ఇచ్చారు. యుజ్వేంద్ర చాహల్, సంజు సామ్సన్, రిషబ్ పంత్‌లు ఎట్టకేలకు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నట్టయింది. అయితే, రింకు సింగ్‌కు టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్‌కు కూడా అవకాశం దక్కలేదు.

టీ 20 వరల్డ్ కప్ ఇండియా టీం ఇదే

1. రోహిత్ శర్మ (కెప్టెన్)
2. హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
3. యశస్వి జైస్వాల్
4. విరాట్ కోహ్లీ
5. సూర్యకుమార్ యాదవ్
6. రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
7. సంజు సామ్సన్ (వికెట్ కీపర్)
8. శివం దూబే
9. రవీంద్ర జడేజా
10. అక్సర్ పటేల్
11. కుల్దీప్ యాదవ్
12. యుజ్వేంద్ర చాహల్
13. అర్షదీప్ సింగ్
14. జస్‌ప్రీత్ బుమ్రా
15. మొహమ్మద్ సిరాజ్

రిజర్వ్:
శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్

Also Read: పది ఫలితాల్లో బాలికలదే పైచేయి. .సత్తా చాటిన గురుకులాలు

ఈ ఏడాది ఐసీసీ మెన్స్ టీ20 సిరీస్‌ వెస్ట్ ఇండీస్, యూఎస్ఏ వేదికగా జరగనున్నాయి. జూన్ 1 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్ గ్రూప్‌ ఏలో ఉన్నది. గ్రూప్‌ ఏలో భారత్‌తోపాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ జట్టులు ఉన్నాయి. ఈ గ్రూప్ మ్యాచ్‌లు జూన్ 5 నుంచి ప్రారంభం అవుతాయి. జూన్ 5వ తేదీన భారత్, ఐర్లాండ్ జట్టులు తలపడతాయి.

ఇది వరకే న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్లను ప్రకటించాయి. తాజాగా, ఇండియా కూడా తమ స్క్వాడ్‌ను వెల్లడించింది.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు