Bcci Likely To Appoint Shubman Gill As Captain For Indias Tour Of Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భవిష్యత్ కెప్టెన్‌గా గిల్‌ను తీర్చిదిద్దడానికి అన్నిరకాల చర్యలను చేపట్టింది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. పనిభారం దృష్ట్యా టీ20లు లేదా వన్డే సిరీస్‌లకు రోహిత్ విశ్రాంతి తీసుకున్న సందర్భాల్లో హార్దిక్ పాండ్య జట్టు బాధ్యతలు అందుకుంటున్నాడు.
ఇక హార్దిక్ పాండ్య గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ కొన్నిసార్లు భారత జట్టును నడిపించాడు. జస్‌ప్రీత్ బుమ్రా వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్నప్పటికీ కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు ఇప్పటివరకు అందుకోలేదు. యువ ఆటగాళ్లతో కలిసి ఐర్లాండ్ పర్యటనలో సారథిగా ఉన్నాడు. కానీ కీలక ఆటగాళ్లతో ఉన్న జట్టుకు నేతృత్వం వహించలేదు. అయితే రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా టీమిండియాకు ఇంతమంది స్టాండ్‌బై కెప్టెన్లు ఉన్నప్పటికీ బీసీసీసీ గిల్‌ను నయా కెప్టెన్‌గా సిద్ధం చేయాలని చూస్తోంది. జింబాబ్వే పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నారు.
Also Read: పాకిస్థాన్ జర్నలిస్ట్‌పై భారత బౌలర్ ఫైర్
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వనుంది. దీంతో స్టాండ్‌బై కెప్టెన్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ కూడా అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అందిస్తారని భావించారంతా.అయితే భారత జట్టులో ఇప్పటికీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయిన రుతురాజ్‌కు బదులుగా ప్రిన్స్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుందని తెలుస్తోంది.