Sri-Charani (Image source Twitter)
స్పోర్ట్స్

AP Rewards Sricharini: ఉమెన్ క్రికెటర్ శ్రీ చరణికి సీఎం చంద్రబాబు బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించనంత నజరానా!

AP Rewards Sricharini: ఇటీవలే ముగిసిన ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్-2025ను గెలిచిన జట్టులో సభ్యురాలు, టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన యువ మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా (AP Rewards Sricharini) సత్కరించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా శ్రీచరణితో మాట్లాడి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు భారీ నజరానా ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదుతో పాటు 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం, గ్రూప్-1 కేడర్ ఉద్యోగాన్ని ప్రకటించింది. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో శ్రీచరణి అద్భుతంగా రాణించడంతో గుర్తింపుగా ఈ నజరానాను సర్కార్ ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో క్రికెటర్ శ్రీచరణికి మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శ్రీచరణి తన అచంచలమైన అంకితభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. ఆమె సాధించిన అద్భుతమైన ఘనతకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.2.5 కోట్ల క్యాష్ ప్రైజ్, కడపలో ఇంటి స్థలంతో సత్కరించనున్నట్లు సంతోషంగా తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణికి అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఆహ్వానం పలకడం గౌరవంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా నారా లోకేష్ వ్యాక్యానించారు. వరల్డ్ కప్ విజయం సాధించిన టీమిండియా జట్టులో సభ్యురాలిగా ఉన్న శ్రీచరణికి సీఎం చంద్రబాబు, తాను అభినందనలు తెలిపామన్నారు. ఆమె సాధించిన విజయం భారతీయ మహిళ సత్తాకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. శ్రీచరణి వెంట భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కూడా ఉంది.

Read Also- Maganti Family Issue: సునీత వల్లే బిడ్డను కోల్పోయా.. కేటీఆర్ వెంటపడ్డా పట్టించుకోలేదు.. మాగంటి తల్లి ఆవేదన

ఇది ఆరంభం మాత్రమే: శ్రీచరణి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అనంతరం శ్రీచరణి మీడియాతో మాట్లాడింది. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు తానెంతో సాధిస్తానని సీఎం సార్ నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని తాను తప్పకుండా నిలబెట్టుకుంటానని ఆమె చెప్పింది.

అంతకుముందు గన్నవరం ఎయర్‌పోర్టు నుంచి శ్రీ చరణి ర్యాలీగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుంది. సీఎం నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ ఆత్మీయస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ అధ్యక్షుడు రవి నాయుడు, శాప్ ఎండీ భరణి, భారత మహిళా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read Also- AP Rewards Sricharini: ఉమెన్ క్రికెటర్ శ్రీ చరణికి సీఎం చంద్రబాబు బిగ్ సర్‌ప్రైజ్.. ఊహించనంత నజరానా!

Just In

01

Air India Crash: ఎయిరిండియా క్రాష్ ఘటన.. పైలెట్‌ తండ్రికి సుప్రీంకోర్టు ఓదార్పు.. కీలక వ్యాఖ్యలు

Phoenix review: ‘ఫీనిక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకు పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించిందా..

Harish Rao On CM: సీఎం రేవంత్ బ్లాక్ మెయిలర్.. జూబ్లీహిల్స్‌‌లో బుద్ధి చెప్పాలి.. హరీశ్ రావు ఫైర్

Cancer Awareness: పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌ పెద్దల దానికంటే ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా?

Breakfast: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఆరోగ్యానికి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?