Ambati Rayudu Cried After Royal Challengers Bangalore Defeat
స్పోర్ట్స్

Ambati Rayudu: ఏడ్చేసిన రాయుడు, ఎందుకంటే..?

Ambati Rayudu Cried After Royal Challengers Bangalore Defeat: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 రన్స్‌ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ బంతుల్లో టాప్ స్కోరర్.విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్ సత్తా చాటారు. మిచెల్ శాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్‌సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నై 200 పరుగులే చేయాలి.

కాగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్‌కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర బంతుల్లో రవీంద్ర జడేజా, అజింక్య రహానె, ఎంఎస్ ధోనీ పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్‌కేకు చివరి ఆరు బంతుల్లో 17 రన్స్‌ అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. కానీ రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ధోనీ పెవిలియన్‌కు చేరాడు. చివరి నాలుగు బంతుల్లో చెన్నై ఒక్క పరుగే సాధించింది.

Also Read:ఆర్‌సీబీ టీమ్ ఆల్‌టైమ్ రికార్డు..!

అయితే ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా పనిచేస్తున్న సీఎస్‌కే మాజీ క్రికెటర్ అంబటిరాయుడు లైవ్‌లోనే ఎమోషనల్ అయ్యాడు. ప్లేఆఫ్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ అర్హత సాధించకపోవడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గత సీజన్‌ ముగిసిన అనంతరం రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో సీఎస్‌కే విజేతగా నిలవడంతో రాయుడు కీ రోల్‌ పోషించాడు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్