Royal Challenge Bangalore All Time Record: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తన పంజాని ప్రదర్శించింది. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ టాప్ స్కోరర్.విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్ సత్తాచాటారు.
మిచెల్ శాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్‌సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నైని 200 పరుగులకే కట్టడి చేయాలి. కాగా..ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్‌కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, అజింక్య రహానె, ఎంఎస్ ధోనీ పోరాడారు.ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే సీఎస్‌కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. యశ్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు.
Read Also: ఆర్‌సీబీ కోసం బరిలోకి దిగేది ఎవరంటే..!
కానీ యశ్ ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి ఐదు బంతుల్లో ఒక్క రన్ ఇచ్చాడు.అయితే ప్లేఆఫ్స్‌కు చేరిన ఆర్‌సీబీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించి, ఏడింట్లో ఓడింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసింది. కానీ చివరి ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో హోరెత్తించి లీగ్ తదుపరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది.