abhishek
స్పోర్ట్స్

IPL 2025: అభిషేక్ .. మాస్ ..ఊరమాస్..

IPL 2025: నేను కొడితే మెడికల్ బిల్లులు కట్టేందుకు మీ ఆస్తులు సరిపోవు అన్న బాలయ్య డైలాగ్ ..యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. క్రీజులో పవర్ ప్లే పూర్తి చేసాడంటే జట్టు స్కోరు 100 దాటించగలడు. రాకెట్ వేగంతో పరుగులు తీయాల్సిందే. రాకెట్ వేగంతో బంతులేసే పేసర్లైనా. మెలికలు తిప్పే స్పిన్నర్లైనా అతను దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్.. అన్నీ సిక్సర్లు..ఫోర్లు..గురువు యువరాజ్ సింగ్ పూనాడన్నట్లుగా బౌలర్ బంతిని వేస్తే చాలు..బాదుడే బాదుడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెన‌ర్ గా అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ జ‌ట్టు విజయాల్లో కీలకంగా మారాడు. దీంతో  వేలంలో అత‌డిని ఫ్రాంచైజీ అంటిపెట్టుకుంది. నిలకడగా పరుగులు చేయడం, ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయలగల సత్తా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే అభిషేక్ శర్మ  ఈసారి కూడా దంచి కొట్టేందుకు సిద్ధమయ్యాడు

తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షం కురిపించే సత్తా ఉన్నోడు.. క్రీజులో ఉన్నంతవరకు భారీషాట్లను ఆడగలడు. పవర్ ప్లే పూర్తి చేసుకున్నాడంటే..మిడిల్ ఓవర్లలోనూ దడ పుట్టిస్తాడు. ఇక అప్పటికీ నాటౌట్ గా నిలిచాడంటే సెంచరీకి చేరువైనట్లే.. అంతేకాదు ఇంగ్లండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లోనూ అతను ఆడిన షాట్లు..ఇంగ్లీష్ పేసర్లను అతను ఆటాడుకున్న తీరు.. అద్భుతం..

అంత‌ర్జాతీయ టీ20ల్లో భార‌త్ త‌ర‌పున అత్యధిక స్కోరు సాధించిన  ఆట‌గాడిగా అభిషేక్ శ‌ర్మ రికార్డులకెక్కాడు. 2023లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గిల్ 126 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలవగా.. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో  135 ప‌రుగులు చేసిన అభిషేక్.. కొత్త రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు టీ20ల్లో భార‌త్ త‌ర‌పున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా అభిషేక్ నిలిచాడు.  అంతర్జాతీయ టీ20 మ్యాచ్‍లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గానూ అభిషేక్‌ చరిత్ర సృష్టించాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్‌ 10 సిక్సర్లు బాదాడు.  తాజా మ్యాచ్‌లో 13 సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌.. రోహిత్‌ అల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ ఏడాది అద్భుత ఫాంలో ఉన్న అభిషేక్ ఘనతలివి.

ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టీ20ల్లో 193.84 స్ట్రైక్ రేట్ తో 535 పరుగులు చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంటే అతనెంతగా దంచికొడుతున్నడో మనకు అర్థమౌతుంది. ఇక ఐపీఎల్ లో అభిషేక్ శర్మ మొత్తం 63 మ్యాచ్‌ల్లో 25.50 సగటుతో  1377 పరుగులు సాధించాడు, అతని ఐపీఎల్ అత్యధిక స్కోరు 75 నాటౌట్. అభిషేక్ శర్మ తన మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 128 ఫోర్లతో పాటు 73 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయంగా సెంచరీలు సాధించినా అతను ఐపీఎల్ లో మాత్రం సెంచరీ కొట్టలేకపోయాడు. కాగా, ఈసీజన్ లో ఈసెంచరీ ముచ్చట కూడా తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ట తరఫున గత సీజన్ లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 16 మ్యాచ్ ల్లో 204.22 స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు సాధించాడు.ఇక ఉపయుక్తమైన స్పిన్నర్ గానూ అతను రాణించాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు 11 వికెట్లు సాధించాడు.

Also Read:Dhoni@43: ధోనీ..నీకు దండాలు సామీ..!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్