Dhoni@43: ఏజ్ అనేది నంబర్ మాత్రమే అనిపిస్తున్నాడు..మహేంద్ర సింగ్ ధోనీ.. కొంతమంది క్రికెటర్లు జట్టును పట్టుకుని వేలాడుతున్నారు.. వీడెప్పుడు రిటైరవుతాడ్రా బాబూ అనుకుంటారు.. కానీ ధోనీ విషయంలో మాత్రం ఇది రివర్స్.. 43 ఏండ్లు వచ్చినా ఐపీఎల్ ఆడాల్సిందేనంటున్నారు ఫ్యాన్స్.. ధోనీ చివరలో వచ్చి ఒకటిరెండు సిక్సర్లు కొట్టినా చాలు..అతని ప్రతి అడుగు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు..
ఇక ఈ ఐపీఎల్ సీజన్ కూ ధోనీ సీరియస్ గా ప్రిపేరవుతున్నాడు. ధోనీ అంటేనే సిక్సర్ల యోధుడు కదా.. అందుకే తొలి మ్యాచ్ వారినిక ముందుగా ధోనీ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ అంటే ఏదో మొక్కుబడి షాట్లు కాదు.. ఫినిషర్ రోల్ పోషించేలా ..మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ తన నుంచి కోరుకునే సిక్సర్లు కొట్టడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్ 22 నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నైలో 23వ తేదీన ..ముంబై ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో తలపడనుంది.
కాగా, ధోనీ ఈ సీజన్ కోసం ఇప్పటికే చెన్నై చేరుకున్నాడు. జట్టులోని యువ క్రికెటర్లకు సలహాలు ఇస్తూ.. జట్టు వ్యూహంపై సూచనలు చేస్తూ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై జట్లు మాత్రమే 5 సార్లు ట్రోఫీలు నెగ్గాయి. అలాంటి జట్టుతో మ్యాచ్ అంటే అంత ఆషామాషీ కాదు. అందుకే కుర్రాళ్లకు సలహాలు ఇస్తూనే.. ధోనీ సైతం సిక్సర్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యలో మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్‌లు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చెన్నైలో నెట్ ప్రాక్టీస్ లో భాగంగా బౌలర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ధోనీ భారీ షాట్ కొట్టాడు. దీంతో బంతి రాకెట్ వేగంతో స్టాండ్స్‌లోకి వెళ్లింది. ఇక ఈ షాట్ ను ధోనీ ఎంత కచ్చితమైన టైమింగ్ తో కొట్టాడంటే బ్యాట్ బంతిని తాకినప్పుడు వచ్చిన సౌండ్ ధోనీ బలాన్ని తెలుపుతుందంటున్నారు.
ఒకవైపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే.. ధోనీ కీపింగ్ కూడా సాధన చేస్తున్నాడు. ఇక ధోనీ కీపింగ్ తో పాటు మ్యాచ్ ఫినిషర్ గా బ్యాటింగ్ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికీ ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే.. యువ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోనట్లుగా కనిపిస్తున్నాడు. గట్టిగా రెండు సిరీస్ లు ఆడితే గాయంతో తప్పుకుంటున్న యువ క్రికెటర్లు ..ధోనీని చూసి నేర్చుకోవాల్సిందేనంటున్నారు. నెట్ ప్రాక్టీస్ లో అతని షాట్లు.. కీపింగ్ ప్రాక్టీస్ లో అతని ఫిట్ నెస్ లెవెల్స్ అబ్బురపరుస్తున్నాయి. ఎంతైనా ధోనీ అంటే వేరే లెవల్ అనుకునేలా ఈ వయసులోనూ అతను తగ్గేదేలే అనిపిస్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రవీంద్ర జడేజా, మతీశ పథిరన, శివమ్ దూబే, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, విజయ్ శంకర్, సామ్ కరన్, షేక్ రషీద్, అన్షుల్ కాంభోజ్, ముకేశ్ చౌధరి, దీపక్ హుడా, గురుజప్నీత్ సింగ్, నాథన్ ఎలీస్, జేమీ ఓవర్టన్, కమలేష్ నాగర్‌కోటి, రామకృష్ణ ఘోష్, అండ్రీ సిద్దార్థ్, వన్ష్ బేడీ, శ్రేయస్ గోపాల్.