A Sensational Record, As A Bowler With A Maiden Over
స్పోర్ట్స్

IPL 2024: సెన్సేషనల్ రికార్డ్, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా..!

A Sensational Record, As A Bowler With A Maiden Over: ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2024లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్ ఇతడే. అంతేకాదు.. ఈ సీజన్‌లో తొలి ఫైఫర్ ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 రన్స్‌ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసిన అతడు, ప్రత్యర్థి జట్టుని చావుదెబ్బ కొట్టి, గుజరాత్ జట్టు పతనంలో మెయిన్‌ రోల్ పోషించాడు. అందుకే యశ్‌కి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. స్టోయినిస్ అర్థశతకంతో రాణిస్తే కేఎల్ రాహుల్, పూరన్, బిష్ణోయి పర్వాలేదనిపించారు. ఇక 164 పరుగుల లక్ష్యంతో దిగిన గుజరాత్ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదట్లో గుజరాత్ ఓపెనర్లు శుభారంభమే అందించారు. కానీ.. జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాక ఆ జట్టు పతనం మొదలైంది. బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రాహుల్ తేవాతియా ఒక్కడే పోరాటపటిమ కనబరిచాడు.

Also Read: నో ఛాన్స్‌, అందుకే అలా..!

కానీ, మిగతా బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. ఈ దెబ్బకు గుజరాత్ జట్టు 130 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. ఐపీఎల్‌లో గుజరాత్ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే.లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్‌తో పాటు కృనాల్ పాండ్యా కూడా అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో లక్నో జట్టు హ్యాట్రిక్ హిట్ నమోదు చేసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో మూడో స్థానంలో నిల్చొంది.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?