CPI Congress Alliance: కొత్తగూడెం కొత్త కార్పొరేషన్ భిన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఎవరి ఎత్తుగడలు వారివి ఎవరికి వరించినో పట్టాభిషేకం అధిష్టానంతో సంప్రదింపుల్లో కొందరు, ఆశా బావులు కొందరు, ప్రధాన అనుచరులు ఆకర్షితులు మరికొందరు. ఇలాంటి విపత్కర పరిస్థితులపై కొత్తగూడెం రాజకీయ పరిస్థితులు ఏవైపు మారనున్నాయి.
విభిన్న పరిస్థితులకు కేరాఫ్ అడ్రస్ ఈ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా (Kothagudem Constituency) కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ సీటు దక్కించుకున్నది. అనంతరం మళ్లీ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ బలాన్ని పుంజుకునే విధంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) వ్యూహాలు నియోజకవర్గంలో వినోత్తర కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటూ మళ్లీ సిపిఐ పునరు వైభవం పొందుటకు జరగబోయే స్థానిక ఎన్నికల్లో తమ బలం పెంచుకొనుటకు జోరుగా కార్యక్రమాలు జరుగుతున్నాయని నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి.
Also Read: Amarnath Yatra buses collide: అమర్‌నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన.. భక్తులకు గాయాలు.. ఏమైందంటే?
దీనిపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు( (Kunamneni Sambasiva Rao) ఎత్తుగడలు ఏంటి స్వేచ్ఛ న్యూస్ పేపర్ స్పెషల్ స్టోరీ ప్రజలతో మమేకమై ఉండే పార్టీ సిపిఐ పార్టీ (CPI Party) శ్రేణులు బాధ్యత యువతంగా పనిచేయాలి నిత్యం సమస్యల పరిష్కారాన్ని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొత్తగూడెం ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతాము. ఈ మధ్యకాలంలో సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇవి గత ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తుల్లో భాగంగా సిపిఐ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం లో కూననేని సాంబశివరావు కేటాయించడం జరిగింది. అనంతరం ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఇతను అప్పటినుండి నిత్యం ప్రజలతోనే ఉంటూ మళ్లీ సిపిఐ పార్టీ బలం పుంజుకునే విధంగా కార్యచరణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో పరిస్థితి
కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం నియోజకవర్గం లో మొదటి నుంచి గట్టి పట్టు ఉన్నది. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీటును సిపిఐ పార్టీకి కేటాయించడం జరిగినది. అప్పటినుండి ఆ కాంగ్రెస్ పార్టీ (Congress party) క్యాడర్ ఆలోచనలో పడినది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని లీడర్లు ఆధిపత్య పోరుతో కొట్టుమిట్టు లాడుతోంది. పార్టీ ప్రతిష్ట కుంటుపడుతుందని చర్చలు గట్టిగానే వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ నుండి పదిమందికి పైగా అనుభవం ఉన్న లీడర్ లో ఉన్న కూడా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగించలేకపోతున్నారు.
అప్పుడప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పుడప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం (Kothagudem Constituency) లో పర్యటించిన సమయంలో లీడర్ లను సమన్వయం చేసే ప్రయత్నం చేసిన కూడా పాత కొత్త లీడర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఎవరి ధోరణ వారిదే అన్నట్టుగా ఉన్నది. పార్టీ కార్యక్రమాల్లో కూడా సీనియర్లు జూనియర్లు అంటూ బహిరంగంగా సవాళ్లు విసురుకునే పరిస్థితి కనబడుతుందని ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వీరిలో ఒకరి తో మరొకరికి ఐక్యత లేకపోవడంతో మంత్రులు నియోజకవర్గంలో పర్యటించే సమయంలో కూడా ఏ మంత్రికి సంబంధించిన లీడర్లు మాత్రమే హాజరవుతున్నారు.
ఇది విధంగా ఉండటం వలన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచలో ఉన్న సీనియర్ నాయకులు సైలెంట్ గా ఉండడంతో వేరే పార్టీ నుండి వచ్చిన నాయకులు హవా కొనసాగిస్తున్నారని వారి ప్రవర్తనతో పార్టీలోని కింది స్థాయి నాయకులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని అప్పుడప్పుడు ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి నియోజకవర్గంలో పర్యటించడంతో నియోజకవర్గంలో మంత్రులు సరిగ్గా రాకపోవడం వల్ల కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రులు సరిగ్గా పర్యటించకపోవడం వలన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కుంటిపడుతుందని భారీగా చర్చలు జరుగుతున్నాయి.
Also Read: Private Education: ప్రైవేట్ విద్యాసంస్థల మజాకా?.. మమ్మల్ని ఆపేవారు లేరు!
సిపిఐ పట్టు బిగింపు కు ముందడుగు]
(Congress party) కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న విభేదాల పైన దృష్టి పెట్టిన మిత్రపక్షమైనా సిపిఐ పార్టీ (CPI Party) క్షేత్రస్థాయిలో పట్టు బిగుస్తోందట. ఎమ్మెల్యే కూనంనేని ఆధ్వర్యంలో ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి మరోవైపు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మార్గంలో గ్రామాల స్థాయి అభివృద్ధి చేస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని పుంజుకునే విధంగా సన్నాహాలు చేస్తు పావులు కదుపుతుందంట.
దీనికి తోడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ నిరుపేదలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో ఇతర పార్టీలోని వారు కూడా వీరు చేసే కార్యక్రమాలకు ముగ్గు చూపే పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని అయితే సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మంచి సత్సంబంధాలు ఉన్న కూడా వారికి పనులు జరగట్లేదని నిరాశతో ఉన్నారని చర్చలు జరుగుతున్నాయి. (CPI Party) సిపిఐ అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావుకు తనకున్న అనుభవం వారికి అనుకూలిస్తుందట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ జోరుగా అభివృద్ధి లక్ష్యంగా సాగుతూ నియోజకవర్గంలో వారి ఆధిపత్యంలోకి తెచ్చుకునే విధంగా పన్నాగన్లో ఉన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ ఎవరో మరి
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ సీటు జనరల్ స్థానం వస్తే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ కె షాబీర్ భాష రేసులో ముందు వరుసలో ఉన్నాడని. కొత్తగూడెం మేయర్ సీటు జనరల్ అయితే సిపిఐ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో పునర్ వైభవంతో ప్రతిష్టంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో వర్గ పోరుతో కొట్టుమిట్టాడుతుందని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుంద వర్గ పోరుతో అయోమయ పరిస్థితిలో కనపడుతుందని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పొత్తులతో ఏమి జరగబోతుంది ఎవరికి పట్టం ఎవరికి కష్టం అన్నదాని పైన కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరి ప్రయత్నంలో వారు వారికి ఉన్న రాజకీయ బలంతో ఎవరి ప్రయత్నంలో వారు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు చివరికి ఈ అదృష్టం ఎవరికి దక్కనున్నది.
Also Read: SR Nagar Police Station: పైసలు కొట్టినవారికే వంత పాడుతున్న పోలీసులు!