Amarnath Yatra (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Amarnath Yatra buses collide: అమర్‌నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన.. భక్తులకు గాయాలు.. ఏమైందంటే?

Amarnath Yatra buses collide: పరమ పవిత్రమైన అమర్ నాథ్ యాత్ర.. జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంచు లింగం రూపంలో ఆవిష్కృతమైన పరమశివుడ్ని దర్శించుకునేందుకు జులై 3 నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. జమ్ముకశ్మీర్ (Jammu Kashmir)లో జరుగుతున్న ఈ యాత్రలో తాజాగా అపశ్రుతి చోటుచేసుకుంది. యాత్రకు వెళ్తున్న ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే..
జమ్ముకశ్మీర్ రాంబన్ జిల్లా (Ramban district)లోని చందర్ కోట్ (Chanderkote) ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఐదు బస్సులతో కూడిన కాన్వాయ్.. అమర్ నాథ్ యాత్రకు రాగా.. అల్పాహారం కోసం వాటిని ఆపారు. ఈ క్రమంలో కాన్వాయ్ లోని ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అది ముందున్న వాహనాలను బలంగా ఢీకొట్టింది. అలా కాన్వాయ్ లోని బస్సులు ఒకదానికొకటి ఢీకొని.. డజన్ల కొద్ది భక్తులు గాయపడ్డారు. మెుత్తం 36 మంది భక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ భక్తులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎస్పీ ఏమన్నారంటే
ప్రమాద ఘటనకు సంబంధించి రాంబన్ జిల్లా ఎస్పీ కుల్బీర్ సింగ్ (Kulbir Singh) మాట్లాడారు. కాన్వాయ్ లోని ఓ బస్సు నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రథమ చికిత్స అనంతరం.. గాయపడ్డ భక్తులు తిరిగి తమ యాత్రను కొనసాగించారని తెలిపారు. అయితే 3-4 భక్తులు మాత్రం.. గాయాల తీవ్రత దృష్ట్యా యాత్రను ముందుకు సాగించలేకపోవచ్చని అన్నారు. దెబ్బతిన్న బస్సులను మార్చిన తర్వాత కాన్వాయ్ తిరిగి తన గమస్యానానికి బయలుదేరిందని ఎస్పీ వివరించారు.

Also Read: Texas Floods: ముంచెత్తిన వరద.. కొట్టుకుపోయిన ప్రజలు.. క్షణ క్షణం ఉత్కంఠ!

యాత్రకు వెళ్లిన నాల్గో బ్యాచ్
జూన్ 3 నుంచి మూడు బ్యాచ్ లు అమర్ నాథ్ యాత్రకు బయలుదేరగా.. శనివారం తెల్లవారు జామున నాల్గో బ్యాచ్ కు అధికారులు అనుమతి ఇచ్చారు. 6,979 మందితో కూడిన నాల్గవ బ్యాచ్ లో 5,196 మంది పురుషులు, 1,427 మంది మహిళలు, 24 మంది పిల్లలు, 331 మంది సాధువులు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. వీరంతా శనివారం తెల్లవారుజామున 3.30 నుండి 4.05 గంటల మధ్య యాత్రకు బయలుదేరారు. కాగా జూన్ 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగనుంది. తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న భక్తులు.. అమర్ నాథ్ ను దర్శించుకోనున్నారు.

Also Read This: SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై.. సింహం, పులి సీరియస్ డిస్కషన్.. వీడియో చూస్తే కడుపు చెక్కలే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు