Politics

BRS Harish Rao: హరీషన్నా.. ఏమైందన్నా? జోరు తగ్గిందేంటి?

BRS Harish Rao: పార్టీలో సీనియర్ నేత. మాస్ లీడర్. ఆయనకు కేడర్ లో ఫాలోయింగ్ ఎక్కువ. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తుంది. ఆ వేడుకలకు సమయం దగ్గర పడుతుంది. కానీ ఆ నేత గత వారం రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో ఇన్ యాక్టీవ్ అయ్యారు. పార్టీ దూరం పెట్టడంతోనే దూరంగా ఉంటున్నారా? అనే చర్చజరుగుతుంది. ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే హరీష్ రావు ఒక్కసారిగా సైలెంట్ కావడంతో రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాఫిక్ గా మారింది.

బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు కనపడటం లేదు. నిత్యం యాక్టీవ్ గా ఉండే నాయకుడు వారం రోజులుగా సైలెంట్ అయ్యారు. గులాబీ పార్టీ ఆవిర్భవించి25ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈ నెల 27న ఘనంగా నిర్వహిస్తుంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అయితే ఈ సభ విజయవంతానికి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పార్టీ కేడర్ ను సన్నద్ధం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఏ ఒక్క కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు..పార్టీ సైలెంట్ గా ఉండమని ఏమైనా చెప్పిందా? కావాలని దూరం పెట్టిందా? ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కనిపించని రివ్యూలు, సన్నాహాక సమావేశాలు
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 6రోజులు మాత్రమే గడువుఉంది. కానీ మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఒక్కరోజూ రెండు రోజులు కాదు.. ఏకంగా ఈ నెల 14 నుంచి పార్టీ కేడర్ తో సన్నాహాక సమావేశాలు లేవు. కేడర్ కు దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపుపై సూచనలు ల్లేవ్. తెలంగాణ భవన్ కు సైతం రావడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనడం లేదనే చర్చ ప్రజలతో పాటు పార్టీ కేడర్ లోనూ ముమ్మరం జరుగుతుంది.

Also Read: Road Accidents: పెరుగుతున్న ప్రమాదాలు.. జాతీయ రహదారులపైనే ఎందుకిలా?

ఈ నెల 13న గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్స్ లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సభపై పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14న పటాన్ చెరువు కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. పార్టీ నేతలతో రివ్యూ నిర్వహించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ నెల 17 నుంచి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్ ఉన్నారనే చర్చజరుగుతుంది.

కేసీఆర్ ఏమైనా చెప్పారా?
పార్టీ అధినేత సభ సక్సెస్ కోసం ఫాం హౌజ్ వేదికగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ భవన్ లో గ్రేటర్ నేతలతో సమావేశం, చేరికలు, మీడియా సమావేశాలు, సభ సక్సెస్ పై కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం జిల్లాల బాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలో వరుస సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆమె, రెండు రోజులు ఉమ్మడి జిల్లా పర్యటనకు వెళ్లారు. పార్టీ కేడర్ తో సమావేశం, సభ సక్సెస్ పై కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో గానీ, సమావేశాల్లో గానీ కనపడటం లేదు.

కేసీఆర్ సైలెంట్ గా ఉండమని చెప్పడంతోనే హరీష్ రావు దూరంగా ఉంటున్నారా? అనే ప్రచారం జరుగుతుంది. హరీష్ రావు ట్రబుల్ షూటర్ అని ఆయనకు ఏ బాధ్యతలు అప్పగించినా విజయవంతం చేస్తారనే ప్రచారం ఉంది. అంతేకాదు ఆయనను ఏదైనా చేయాలని కేసీఆర్ అప్పగిస్తే అది కంప్లీట్ చేసేవరకు నిద్రపోరనే నానుడి ఉంది. అయితే కీలక సమయంలో హరీష్ రావు సైలెంట్ గా ఉండటం పార్టీ కేడర్ లోనూ, రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చజరుగుతుంది.

Also Read: Hyderabad Traffic: మహానగరంలో తప్పని తిప్పలు.. బేజారవుతున్న వాహనదారులు!

పార్టీలో ఏం జరుగుతుంది?
ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజలను తెలియజేయాల్సిన సమయం. పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ఏకతాటిపై నడవాల్సిన తరుణం. కానీ కేటీఆర్, కవితలకు సభ బాధ్యతలను అప్పగించి, హరీష్ రావును దూరం పెట్టారా? అనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ తనయులు కాబట్టే రేపటి ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారా? ఇంటికే ప్రియార్టీ ఇస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతుంది.

అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక, హరీష్ రావు మౌన ప్రదర్శన ఎందుకో అర్ధంకాక కేడర్ తో పాటు సొంత అనుచరుల్లోనూ చర్చకు దారితీసింది. వారు పార్టీ అధినేత తీరుతో అయోమయానికి గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గులాబీ పార్టీలో సభ ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతుంది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు