Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత (Kavitha) చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో తీవ్ర విమర్శలు సంధించిన కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు మౌనం వహించడంపై పొలిటికల్ సర్కిళ్లతో పాటు సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కవిత అరెస్ట్, లిక్కర్ స్కామ్ అంశాలపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేతలు, కొన్ని రోజులుగా ఆమె విషయంలో అనూహ్యమైన సంయమనం పాటిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన రాజకీయ కారణాలేమిటి అని పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా ఆమె బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఈ ఇష్యూను కాంగ్రెస్ ఇంటిపోరుగానే పరిగణిస్తూ వచ్చింది. కానీ, తాజాగా మండలిలో కవిత ఆవేదన, ఆరోపణల తర్వాత ఇష్యూను అబ్జర్వ్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది.
అంతా గమనిస్తున్న పార్టీ
కవిత కంటిన్యూగా చేస్తున్న వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో వ్యవహరించాలని అనుకుంటున్నది. దీనిలో భాగంగానే శాసన మండలిలో తగినంత సమయం కేటాయించి, ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకోవాలని పార్టీ భావించినట్లు టాక్. పైగా, ఆమె బీఆర్ఎస్‌ను పూర్తిగా విమర్శించడం కూడా కాంగ్రెస్‌కు మైలేజ్ వచ్చినట్టేనని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Also Read: Kavitha: కవిత రాజీనామా వెనుక అసలు కారణమేంటి? మండలిలో బహిర్గతమయ్యే నిజాలు ఇవే?
ఆ ఇష్యూపైనే ఫోకస్
ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్లు, క్యాడర్లు ఈ ఇష్యూపైనే ఫోకస్ పెట్టారు. కవిత వేసే ప్రతి అడుగును మంత్రులు, ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు. ఆమె చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయనే ఉత్కంఠ పార్టీలో నెలకొన్నది. తెలంగాణలో ఏ సమస్య తలెత్తినా, ఇప్పుడు చర్చ మళ్లీ కవిత ఎపిసోడ్ దగ్గరికే వస్తున్నది. ఒక రకంగా ఆమెను రాజకీయ కేంద్ర బిందువుగా మార్చడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలను, ఇతర కీలక నేతల ప్రాధాన్యతను తగ్గించాలనేది కాంగ్రెస్ అంతర్గత వ్యూహం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాఫ్ట్ కార్నర్ వెనుక
మరోవైపు, కవిత విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న సాఫ్ట్ కార్నర్ వెనుక బీజేపీని డిఫెన్స్‌లో పడేయడం ఒక కారణమైతే, బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం సృష్టించడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. మొత్తంగా కవిత ఎపిసోడ్‌ను కాంగ్రెస్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. నిజంగానే ఆమె విమర్శలు చేస్తున్నారా, పొలిటికల్ స్టంట్స్ ఉన్నాయా వంటి అంశాలపై పార్టీ అంతర్గతంగా అధ్యయనం చేస్తున్నది. గతంలో లాగా వెంటనే రియాక్ట్ అయ్యి మైలేజ్ ఇవ్వడం కంటే ఆమె వైఖరిని లోతుగా అధ్యయనం చేయాలని పలువురు సీనియర్ నాయకులు పార్టీకి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆమె కామెంట్ల ప్రభావంపై ఇంటెలిజెన్స్, పొలిటికల్ టీమ్స్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. కవిత ఎపిసోడ్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే రెస్పాండ్ అవ్వాలని పార్టీ భావిస్తున్నది.
Also Read: Kavitha Kalvakuntla: అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు.. కవిత సంచలన వ్యాఖ్యలు

