Kavitha: రాష్ట్ర శాసన మండలికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) హాజరవుతున్నారు. కవిత (Kavitha)ను సెప్టెంబర్ 2న గులాబీ పార్టీ సస్పెండ్ చేసింది. కవిత మూడో తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది.. కారణాలేంటి.. తాను గులాబీ పార్టీకి ఎందుకు దూరమైంది… అసలు ఏం జరుగుతుంది అనే వివరాలను మండలి వేదికగా కవిత వివరించబోతున్నారు.
Also Read: MLC Kavitha: వారికి నేను అండగా ఉంటా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
కవిత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో భేటీ
తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థ తరఫున ఆమె చేసిన పోరాటం.. టిఆర్ఎస్ పార్టీలో పోషించిన పాత్ర.. పార్టీ సస్పెండ్ వరకు అన్ని వివరాలను వివరించనున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో కవిత ఎవరెవరి పై విమర్శనాస్త్రాలు సంధిస్తుందనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈనెల 2న మండలికి వచ్చిన కవిత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో భేటీ అయింది. తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేయగా.. మండలికి రావాలని సూచించగా సోమవారం అసెంబ్లీకి వచ్చి రాజీనామా పై వివరణ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.

