Kalvakuntla Kavitha: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై చూపలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎంజికేఎల్ఐ లిఫ్టులో బ్లాస్టింగ్ కు హరీష్ రావే కారణమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం పంప్ హౌజ్ ను ఆమె పరిశీలించారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు తన సొంత జిల్లా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని అన్నారు.
కరప్షన్.. డైవర్షన్ పాలిటిక్స్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి రూ. 4300 కోట్లు ఇచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇస్తే పాలమూరు ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదన్నారు. నారాయణపేట- కొండగల్ స్కీంలో మెగా రెడ్డికి 1000 కోట్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెయ్యి కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్సే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిది కరప్షన్.. డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఫస్ట్ ప్రాజెక్టు ఎల్లూరు ఓపెన్ పంప్ హౌస్ కడితే కల్వకుర్తికి ఇబ్బంది అవుతుందని, ఓపెన్ పంప్ హౌస్ కట్టారని, నాటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఆ కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారని దాన్ని బ్లాస్టింగ్ చేయడంతో కల్వకుర్తిలో మూడో, ఐదో మోటార్ విరిగిపోయావన్నారు. హరీష్ రావు నిర్వాకం వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మూడే మోటర్లు పనిచేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
900 ఎకరాలు.. రైతులకు ఇచ్చేయాలి
వట్టెం రిజర్వాయర్ లో నల్లమట్టి కోసం తీసుకున్న 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ కు సాగునీరు అందడం లేదనన్నారు. మెడికల్ కాలేజీకి భూములు ఇచ్చిన దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. నాగర్ కర్నూల్ కు ఇప్పటివరకు రైల్వే లైన్ రాలేదని కవిత గుర్తుచేశారు. ఇప్పుడున్న ఎంపీ చొరవ తీసుకొని రైలు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి పాలమూరులో 308 కిలో మీటర్లు పారుతుందని, వాటా ప్రకారం 550 TMCలు రావాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకంలో కాల్వల పనులు జరగలేదన్నారు. పాలమూరు జిల్లాలో 25లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా బీఆర్ఎస్ 6.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిందన్నారు.
ఏపీ వల్ల పాలమూరుకు అన్యాయం
ఏపీకి బనకచర్లతో చంద్రబాబు, లోకేష్ లు వరద నీటి పేరుతో ప్రాజెక్టులు కట్టుకుంటున్న్నట్లు చెబుతున్నారని, ఇలా చూస్తూ అడ్డుకోకుంటే ట్రిబ్యునల్ లో నీటివాటా ఏపీకీ ఇస్తుంది అన్నారు. సీఎం నల్లమల పులిబిడ్డ అంటారని, పాలమూరుకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నీటికి జూరాల ప్రాజెక్టు ఆధారం అన్నారు. జూరాల నీటి ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టాలని, శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా చేపటితే శాశ్వత అంతర్రాష్ట్ర సమస్యగా మారుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే 90TMCలు హక్కుగా వచ్చేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 45TMCలు చాలని లేఖ ఇచ్చిందని చెప్పారు.
Also Read: BRS Party: కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం!
‘ఇసుక మాఫియాను అడ్డుకోవాలి’
మరోవైపు నాగర్‌కర్నూల్ పట్టణంలో మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. అమ్రాబాద్ లోని చెంచుగుడాలు ఇప్పటికి అభివృద్ధి జరగలేదన్నారు. దుందుభి నదిలో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకొని మరి ఎంపీ చొరవ తీసుకొని రైలు వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అమ్రాబాద్ లోని చెంచుగుడాలు ఇప్పటికి అభివృద్ధి జరగలేదన్నారు. దుందుభి నదిలో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టుకొని మరి ఇసుక దోచుకుంటున్నారు. అధికారులు దృష్టి సారించి ఇసుక మాఫియా అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని కులాల వారికి సరి సమానంగా అభివృద్ధి జరగాలి. అందరికీ అవకాశాలు రావాలి అందుకోసమే సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందని అన్నారు. ప్రెస్ మీట్ అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కవిత.. అక్కడి రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే దివంగత కవి కపిలవాయి లింగమూర్తి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

