BRS Party: ప్రభుత్వం దూకుడు.. గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి!
BRS Party ( image credit: twitter)
Political News

BRS Party: కాంగ్రెస్ దూకుడుతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి.. గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం!

BRS Party:  గులాబీ పార్టీ ఒడిదుడుకులతో సతమతమవుతుంది. ఒకవైపు వరుస ఓటములు మరోవైపు వెంటాడుతున్న కేసులు.. ఇంకోవైపు కవిత చేస్తున్న విమర్శలతో పార్టీని ఇరుకున పెడుతున్నాయి. దీంతో పార్టీ కేడర్ ను సైతం ఆందోళన గురిచేస్తున్నాయి. ఈ డ్యామేజీని కంట్రోల్ చేసే అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని.. అందుకే వర్ష సభలకు శ్రీకారం చూపుతున్నానని ప్రచారం ఊపు అందుకుంది. పార్టీ క్యాడర్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి కే పరిమితం కావడం కావడం.. పార్టీని నడిపే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే పార్టీ అనుకున్న స్థాయిలో రెండు ఏళ్లలో బలోపేతం కాలేదని.. క్యాడర్లో ఆశించిన మేరకు భరోసా కల్పించలేదని.. ఇంకా వారిలో నైరాశ్యం నెలకొని ఉందని గుర్తించిన కేసీఆర్ పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాన్ని తెరమీదకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లలేదు 

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ నుంచి ఇరిగేషన్ అంశాన్ని లేవనెత్తాలని భావించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంతో ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టుతో లాభం కలుగుతుందని.. కానీ కాంగ్రెస్ రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లలేదని పూర్తి చేయలేదని ప్రజలకు వివరించాలని భావించి మూడు జిల్లాల్లో సభలకు స్వీకరించుటబోతున్నట్లు ప్రకటించారు. ఆ మూడు జిల్లాల నేతలతో సైతం కేసీఆర్ భేటీ అయ్యారు. సభలను ఎక్కడెక్కడ నిర్వహిస్తే బాగుంటుందని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సభకు ముందే జిల్లాల్లో ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కరపత్రాల రూపంలో, పాటల రూపంలో అన్యాయాన్ని వివరించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్లోను భరోసా అనే ప్రయత్నం చేయబోతున్నారు. సంక్రాంతి తర్వాతే సభలకు శ్రీకరం చుట్టూ పోతున్నట్టు సమాచారం.

Also Read: BRS party – KTR: బీఆర్ఎస్‌కి పూర్వవైభవం మొదలైంది.. కేటీఆర్ పొలిటికల్ హాట్ కామెంట్స్

ఎమ్మెల్యేలలు చేసినకబ్జాలపై దృష్టి

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కాలేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం, ఫార్ములా ఈ కార్ రేస్, ఫోన్ టాపింగ్, నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలు చేసినకబ్జాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే కేసులు నమోదు చేస్తుంది. పార్టీ కీలక నేతలైన కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు సైతం విచారణకు హాజరయ్యారు. తాజాగా ఫోన్ టాపింగ్ కేసు ఇప్పుడు గులాబీ పార్టీని కలవర పెడుతుంది. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా చిచ్చాట్లోనే అసెంబ్లీ సమావేశాల తర్వాత తనపై ఫోన్ టాపింగ్ కేసు పెడతారని ప్రకటించారు. దీంతో పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు సైతం పార్టీ మారకుండా ఉండే అందుకే కేసిఆర్.. ఇరిగేషన్ అంశం తెర మీదకు తెచ్చి సభలకు శ్రీకారం చుట్టారనే అనే ప్రచారం ఊపందుకుంది.

పాలమూరు జిల్లాలో రెండు స్థానాల్లో విజయం

దక్షిణ తెలంగాణ కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ అయితే ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక స్థానం, ఉమ్మడి నల్గొండలో ఒక స్థానం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ దక్షిణ తెలంగాణ పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు టిఆర్ఎస్ చేజెక్కించుకోవడంతో ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నిధుల కేటాయింపులు అన్యాయం చేస్తుందని.. ఇరిగేషన్ ప్రాజెక్టులు సైతం పూర్తి చేయడం లేదని.. చూపుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నం ముమ్మరం చేస్తుంది.

ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీని కేసిఆర్ గాడిన పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయోనని ఆసక్తిని నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోవడం.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు కేసిఆర్ రంగంలోకి దిగుతున్నారు. అయితే కేవలం ఈ మూడు జిల్లాలోని సభలు నిర్వహించి ఊరుకుంటారా.? లేకుంటే అన్ని ఉమ్మడి జిల్లాలో సభలకు ప్లాన్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Also Read: BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా.. సొంత నేతలపై నిఘా!

Just In

01

Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్

Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?

Motorola: భారత మార్కెట్‌కు మోటరోలా ‘సిగ్నేచర్’ సిరీస్..

Accreditation Policy: అక్రిడిటేషన్ కొత్త జీఓను సవరించాలి.. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలి.. టియూడబ్ల్యూజే డిమాండ్!

Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. దేశం వీడిన 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజనీర్లు.. కారణం ఏంటంటే?