Mahesh Kumar Goud( IMAGE credit: swetcha
Politics

Mahesh Kumar Goud: ఈసీ తీరుపై న్యాయ పోరాటం.. అప్రజాస్వామిక చర్యలని టీపీసీసీ చీఫ్ ఫైర్

Mahesh Kumar Goud: కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను అక్రమంగా అరెస్టు చేశారని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు.  మీడియాతో మాట్లాడుతూ ఓట్ల చోరీపై ఆధారాలతో సహా నిరూపించి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఖర్గే, రాహుల్, ప్రియాంకలను మోదీ సర్కారు ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఓట్ల చోరీపై వినతి పత్రం ఇస్తామని శాంతియుతంగా వెళ్తున్న ఎంపీలను అరెస్ట్ చేయడం అక్రమమని, అప్రజాస్వామ్యమని అన్నారు.

 Also Read: Gurukulam: సవాళ్ల నడుమ నడుస్తున్న గురుకులాలు.. సమస్యలు సృష్టిస్తున్న పాత కాంట్రాక్టర్లు

న్యాయ పోరాటం చేస్తాం

ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ఒక వైపు దేశంలో బీజేపీ(BJP) రాజ్యాంగాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తుంటే, మరోవైపు ఈసీ కూడా వారికి బలాన్ని చేకూరుస్తూ, ఎన్నికల నిర్వహణను నిర్వీర్యం చేసేందుకు మద్దతిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. నిజంగా ఈసీ స్వతంత్రంగా వ్యవహరిస్తే ఈపాటికే రాహుల్ కోరినట్టుగా మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచేదన్నారు. రాబోయే ఎన్నికలను పారదర్శకంగా జరిగేలా కేంద్రంపై, ఈసీ తీరుపై రాహుల్ నేతృత్వంలో, ఇండియా కూటమి ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని మహేశ్ వెల్లడించారు.

 Also Read: Rana Daggubati: మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రానా నుంచి ఏం తీసుకున్నారంటే?

శాంతియుత ర్యాలీకి అరెస్టులా మంత్రి పొన్నం ప్రభాకర్ 

బీజేపీ తగిన మూల్యం తప్పక చెల్లిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ..శాంతియుత ర్యాలీకి అరెస్టులు చేయడమా? అని ప్రశ్నించారు. లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తో పాటు ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో ,నప్రత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ..ఓట్ల చోరీ పై పోరాటం చేస్తున్నారన్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీ కి వినతి పత్రం సమర్పించాలని భావించిన తమ నాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఓటర్ల లిస్టు కు సంబంధించి అవతకవకలపై ఆటంబాబు లాగ వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేని బీజేపీ ,దానిపై నిరసనలు తెలిపే అవకాశాలను కూడా కాలరాస్తుందన్నారు.

Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు