Mahesh Kumar Goud( image credit: swetcha reporter)
Politics

Mahesh Kumar Goud: కేసీఆర్ కేటీఆర్‌పై.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌లే ప్రధాన సూత్రధారులని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను రెండున్నర సంవత్సరాలపాటు ట్యాప్ చేశారని, విషయం బయట పడడంతో డేటా మొత్తం ధ్వంసం చేశారని మండిపడ్డారు. చేసిందంతా చేసి ఇప్పుడు కేసీఆర్,(KCR) (KTR) కేటీఆర్‌లు నీతులు చెబుతున్నారని విమర్శించారు.  ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ (Anil Kumar Goud)  సిట్ ఆఫీస్‌కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చారు. గద్వాల్ కాంగ్రెస్ (Congress)  నాయకురాలు, మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ సరితతోపాటు మరికొందరు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్( Andrapradesh)  అధ్యక్షురాలు షర్మిల (Sharmila) కూడా తన ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేశారు.

దూకుడు పెంచిన సిట్ అధికారులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో (SIT Investigation) సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును (Prabhakar Rao) అష్ట దిగ్బంధనం చేస్తున్నది. కేసులోని సూత్రధారులు ఎవరన్నది చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నది. ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్  (Phone Tapping Case)వ్యవహారాన్ని నడిపించిన విషయం తెలిసిందే. దీని కోసం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో ఎస్‌వోటీని ఏర్పాటు చేశారు.

Also Read: BRS Party: ప్రాజెక్ట్ గొప్పదనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్!

నాయకుల ఫోన్లను ట్యాప్

మావోయిస్టు సానుభూతిపరులమని పేర్కొంటూ వేర్వేరు పార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల నెంబర్లను రివ్యూ కమిటీకి పంపించి వాటిని ట్యాప్ చేసేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇలా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 600కు పైగా ఫోన్లను ట్యాప్ చేసి రికార్డ్ చేశారు. అప్పట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, (Mahesh Kumar Goud) అప్పటి పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy)  ఈటల రాజేందర్, అర్వింద్ కుమార్, రఘునందన్ రావుతోపాటు (BRS) బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల ఫోన్లను ట్యాప్ (Phone Tapping) చేశారు. దీనికోసం ప్రత్యేకంగా వార్ రూంలు సైతం ఏర్పాటు చేశారు.

ఫోన్లను ట్యాప్ చేసి సేకరించిన సమాచారాన్ని (BRS) బీఆర్ఎస్ పెద్దలకు పంపిస్తూ వచ్చారు. దీంట్లో ప్రణీత్ రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతోపాటు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు కీలక పాత్ర వహించారు. కాగా, ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)  ఏర్పడిన కొన్నాళ్లకే ఫోన్ ట్యాపింగ్ బాగోతం వెలుగు చూసింది. దీనిపై కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు  (Prabhakar Rao) అమెరికాకు పారిపోగా విశ్వ ప్రయత్నాలు చేసి అధికారులు 14 నెలల తర్వాత ఆయనను వెనక్కి రప్పించారు.

సిట్ ఆఫీస్‌కు రావాలి

అయితే, సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో వచ్చిన ప్రభాకర్ రావు (Prabhakar Rao) విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకోవాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా (Prabhakar Rao) ప్రభాకర్ రావును మరింత నిశితంగా ప్రశ్నించాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా సిట్ ఆఫీస్‌కు రావాలని మహేశ్ కుమార్ గౌడ్‌ను (Mahesh Kumar Goud) కోరారు. ఈ క్రమంలో ఆయన ఉదయం 11:30 గంటల సమయంలో ఆఫీస్‌కు రాగా, రెండు గంటలకు పైగా ప్రశ్నించి వివరాలను రికార్డు చేశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, గద్వాల్ కాంగ్రెస్ నేత సరితతోపాటు మరికొందరి నుంచి కూడా స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.

 Also Read: Water Diversion: బనకచర్లను అడ్డుకోవాలని.. కేంద్రానికి లేఖలు!

కీలక సూత్రధారులు తండ్రీకొడుకులే

సాక్షి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌లే ప్రధాన సూత్రధారులని వ్యాఖ్యానించారు. తన ఫోన్‌ను రెండున్నర సంవత్సరాలపాటు ట్యాప్ చేశారన్నారు. విషయం బయట పడటంతో డేటా మొత్తం ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం 15 రోజుల డేటా మాత్రమే ఉందన్నారు. నక్సల్స్, ఉగ్రవాదుల ఫోన్లు ట్యాప్ చేయాలి కానీ వారి పేర రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.

చేసిందంతా చేసి ఇప్పుడు కేసీఆర్,( KCR) (KTR) కేటీఆర్‌లు నీతులు చెబుతున్నారని విమర్శించారు. దీంట్లో వంద శాతం సూత్రధారులు కేసీఆర్, కేటీఆర్‌లే అని చెప్పారు. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీల పాత్రపై కూడా ఆరా తీయాలన్నారు. కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకే ప్రజలు (BRS) బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పారన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, (Congress) కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వారి ఫోన్లు ట్యాప్ చేసి వారిని భయపెట్టి చేరకుండా అడ్డుకున్నారన్నారు. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ (BRS) గెలిచిందని చెప్పారు. ఈ వివరాలనే సిట్‌కు తెలియ చేశానని చెప్పారు.

 ప్రభాకర్ రావు విచారణ
పలువురు బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్న సిట్ అధికారులు (Prabhakar Rao)ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. నిజానికి మంగళవారం ఆయనను ప్రశ్నించాలి. అయితే, బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్న నేపథ్యంలో (Prabhakar Rao) ప్రభాకర్ రావును బుధవారం విచారణకు రావాలని సూచించారు.

 బీజేపీ ఎంపీలు
ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో ఉన్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్ కుమార్, రఘునందన్ రావులు నేడు సిట్ ఆఫీస్‌కు వచ్చి స్టేట్‌మెంట్లు ఇవ్వనున్నారు.

నా ఫోన్లు ట్యాప్ చేశారు : వైఎస్ షర్మిల
ప్రభాకర్ రావు టీం తన ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ ( Andrapradesh)  కాంగ్రెస్ (Congress) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఆరోపించారు. తాను (Hyderabad) హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఫోన్లు ట్యాప్ (Phone Tapping) చేసి సమాచారాన్ని జగన్‌కు అందించారని ఆమె పేర్కొంది.

 Also Read: Sandhya Convention Land Dispute: సంధ్య శ్రీధర్‌కు బిగ్ షాక్.. ఎఫ్‌సీఐ లేఔట్‌ పునరుద్ధరణ!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు