BRS Party: ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సన్నద్ధమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మించి ఆరేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, ప్రభుత్వం చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తున్నది. ఇప్పటికే పార్టీ క్యాడర్‌కు పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని సమాచారం ఇచ్చింది. ఈ నెల 21న కాళేశ్వరం అంటే కల్పతరువు అనే అంశాన్ని వివరించాలని భావిస్తున్నది. 2019 జూన్ 21న నాటి సీఎం కేసీఆర్(KTR) ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే, ఈ నెల 21వ తేదీతో 6ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ ఆరేళ్లతో ప్రాజెక్టు సాధించిన ఘనత వివరించేందుకు బీఆర్ఎస్ (BRS సిద్ధమవుతున్నది.
ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్‌ల, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిప్టు, 240 టీఎంసీల వినియోగం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు సంబంధించిన వివరాలను సైతం నేతలకు పంపించారు. కాళేశ్వరంతో 37లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరీకరించమనే వివరాలను ప్రజలను వివరించనున్నారు.
Also Read: Water Diversion: బనకచర్లను అడ్డుకోవాలని.. కేంద్రానికి లేఖలు!
అధిష్టానం ఆదేశాలు
అదే విధంగా 2014లో కోటి 31లక్షల 34 వేల ఎకరాలకు నీరందింస్తే, కాళేశ్వరంతో (Kaleshwaram) 2023 నాటికి 2 కోట్ల 20లక్షల ఎకరాలకు నీరందించిన విషయాన్ని విస్తృత ప్రచారం చేయనున్నారు. ధాన్యం ఉత్పత్తిలోనూ 2014లో 68లక్షల టన్నుల నుంచి 2023లో 2కోట్ల 70లక్షల టన్నుల దిగుబడి సాధించామని, అన్నిరకాల పంటల దిగుబడిలోనూ 2013-14లో ఒక కోటి 7లక్షల 49 వేల టన్నులు, 2022–23లో 4కోట్ల 65లక్షల 24వేల 336 టన్నుల దిగుబడి సాధించామని, నాలుగు రేట్లు పెరుగుదల సాధించిన విషయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాల మట్టం సగటున 5.36 మీటర్లు పైకి ఎగిసిన విషయాన్ని విత్ ఆధారాలతో వివరించాలని ఇప్పటికే పార్టీ క్యాడర్‌ను అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.
విమర్శలకు పదును
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, బ్యారేజీలో పిల్లర్ల కుంగుబాటుకు బీఆర్ఎస్ ((BRS) ప్రభుత్వం అని విమర్శలకు పదును పెట్టింది. దానిపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ సైతం విచారణ చేపట్టింది. అయితే, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో (Kaleshwaram Project) సాధించిన ఘనతను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) భాగమైన రిజర్వాయర్, బ్యారేజీల వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు వెళ్లి అక్కడ పరిశీలించడంతో పాటు వాటి ఘనతను వివరించనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సైతం గంధమల్ల గానీ, బస్వాపూర్ గానీ లేకుంటే, మల్లన్నసాగర్ ఇలా ఏదో ఒక దగ్గరకు వెళ్లి పరిశీలించి ప్రజలకు బీఆర్ఎస్ (BRS) చేసిన మంచి పనులు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు మార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ బృందం
మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) బీఆర్ఎస్ (BRS) బృందం వెళ్లనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని హరీశ్ రావు (Harish Rao) ప్రకటించారు. దీంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తుందని, మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును ఎండబెడుతూ యాసంగిలో రైతు పొలాలను ఎండబెట్టి కన్నీళ్లు మిగుల్చిందని బీఆర్ఎస్ (BRS) మండిపడుతున్నది. ఇదే విషయాన్ని మరోమారు ప్రజలకు వివరించాలని అందుకు ఈ నెల 21వ తేదీని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. కాళేశ్వరం (Kaleshwaram) గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.
Also Raed: Sandhya Convention Land Dispute: సంధ్య శ్రీధర్‌కు బిగ్ షాక్.. ఎఫ్‌సీఐ లేఔట్ పునరుద్ధరణ!