Water Diversion: తెలంగాణకు (Telangana) రావాల్సిన నీటిని ఏపీ తరలించుకుపోతున్నా పోరాటం లేదు. కేంద్రాన్ని నిలదీసింది లేదు. ఆ పార్టీ తీరును ఎండగట్టింది లేదు. కేవలం లేఖలతో మాత్రమే (Telangana తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు తప్ప ప్రత్యక్ష పోరాటానికి, కార్యాచరణకు పిలుపు నివ్వడం లేదు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు నష్టం జరిగేలా ఏపీ ప్రభుత్వం (AndhraPradesh Government) ప్రాజెక్టులను నిర్మిస్తున్నా గట్టి వాదనను వినిపిస్తున్న దాఖలు లేవు. ఏపీ దూకుడు పెంచుతున్నా, తెలంగాణ ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)మాత్రం లేఖలతో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ (Telangana) ప్రజలకు పోరాటాలు కొత్త కాదని పేర్కొంటున్నారు తప్ప, నీళ్లలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి.
కేంద్రానికి వాదన వినిపించడంలో విఫలం
గోదావరి నది తెలంగాణలో 750 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నది. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం చూసినా 1,486 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు (Telangana) కేటాయించారు. కానీ, ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల్లో నీటిని తరలించుకుపోయేందుకు బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. అందుకు సంబంధించిన ప్రీ ఫీజుబిలిటి రిపోర్ట్(పీఎఫ్ఆర్)ను సైతం అందజేసింది. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను అందజేసి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను సైతం పిలిచే ప్రయత్నం ముమ్మరం చేసింది. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలు చెరబట్టేందుకు ఏపీ ముమ్మర ప్రయత్నం చేస్తున్నది.
రోజుకు రెండు టీఎంసీల సామర్థ్యంలో మొత్తం 200 టీఎంసీలు తరలింపుతో పాటు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ వేగవంతమైన చర్యలు చేపడుతున్నది. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయం ప్రతిపాదన చేస్తున్నది. కృష్ణ, పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సరఫరాకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బకనచర్ల ప్రాజెక్టుకు గోదావరి, కృష్ణా బోర్డుల అనుమతి లేదు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ లేదు. అపెక్స్ కౌన్సిల్ అనుమతీ లేదు. కేంద్ర జల వనరుల కమిషన్‌తో పాటు బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగుతోందని తెలంగాణ ఆరోపిస్తున్నది. కానీ, కేంద్రం ముందు బలంగా తన వాదనను వినిపించడంలో విఫలమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Sandhya Convention Land Dispute: సంధ్య శ్రీధర్‌కు బిగ్ షాక్.. ఎఫ్‌సీఐ లేఔట్ పునరుద్ధరణ!
ఏపీ ప్లాన్ ఇదే..
ఐఎస్‌డబ్ల్యూఆర్‌డీ యాక్ట్ 1956, సెక్షన్ 3 ప్రకారం గోదావరి ట్రైబ్యునల్‌ను వేయమని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఇది వరకే అర్జీ పెట్టుకున్నది. గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో జల దోపిడీకి ఏపీ ప్లాన్ చేయగా, బనకచర్ల ప్రాజెక్టు పనులను ముందుగానే ప్రారంభించి, నిధులు ఖర్చు చేసి, 200 టీఎంసీల నీటిని కేటాయించాలని గోదావరి ట్రైబ్యునల్ ముందు వాదించే ప్లాన్ చేస్తున్నది. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణ (Telangana) ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీల నీటి వాటాను ఏపీ ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నది. కృష్ణ అవార్డ్‌లో ఉన్నట్టు గోదావరి అవార్డ్‌లో నికర జలాలు, వరద జలాలు అనే కాన్సెప్ట్ లేదు.
అదనం 112.5 టీఎంసీల వాటా ఇవ్వాలి
గోదావరి అవార్డులో వాడిన పదం, ఆల్ వాటర్స్ అవి ఏవైనా కావచ్చు. కాబట్టి పోలవరం నుంచి కృష్ణ బేసిన్‌కు తరలించే నీటికి బదులుగా కృష్ణ జలాల్లో తెలంగాణకు (Telangana) వాటా పొందే హక్కు ఉన్నది. గోదావరి అవార్డు ప్రకారం 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కు తరలించినట్టయితే, అందుకు గాను 45:21:14 నిష్పత్తిలో కృష్ణ జలాల్లో వాటాను ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణ జలాల్లో తెలంగాణకు (Telangana) అదనం 112.5 టీఎంసీల వాటా ఇవ్వాలి. పోలవరం ద్వారా తరలించే గోదావరి నీటికి బదులు తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కృష్ణ జలాల్లో గోదావరి అవార్డు ప్రకారం.. రావాల్సిన వాటా 45+112.5=157.5 టీఎంసీలు డిమాండ్ చేయాల్సి ఉంది. 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమేకాక భవిష్యత్తులో దానిని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఏపీ సర్కారు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో జలసౌధలో జరగాలి
తెలంగాణ అంగీకారం లేకుండానే కేంద్ర సహకారంతో గోదావరి, బనకచర్ల లింకు పనులను ఏపీ ప్రభుత్వం (AndhraPradesh Government) వేగవంతం చేసింది. నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టే ముందు ఆ నది బేసిన్‌లో ఉండే రాష్ట్రాల అనుమతి కోసం కన్సల్టెన్సీ మీటింగ్‌ను నిర్వహిస్తారు. జూన్ 12న హైదరాబాద్‌లో (Hyderabad) జలసౌధలో జరగాల్సిన గోదావరి, కావేరి కన్సల్టెన్సీ మీటింగ్‌ను రద్దుచేసి అదే రోజు గోదావరి, బనకచర్ల, కావేరి లింక్ ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్ మీటింగ్ ఢిల్లీలో నిర్వహించారు. గతంలో బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వ్యతిరేకిస్తే గోదావరి, కావేరి లింక్‌ను సమ్మక్క సాగర్ వద్ద నిర్మాణాన్ని నిలిపివేసింది కేంద్రం.
గోదావరి, బనకచర్ల లింక్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా సూత్రప్రాయంగా అంగీకరించడమంటే తెలంగాణకు (Telangana) తీరని అన్యాయం చేయడమే. సమ్మక్క సాగర్ నుంచి గోదావరి, కావేరి అనుసంధానం చేపడితే తెలంగాణ భూభాగానికి 75 టీఎంసీ వాటా దక్కుతుంది. దానివల్ల (Telangana) తెలంగాణ 75 టీఎంసీల నీటిని నష్టపోతుంది. తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం 2024 – 25 నీటి సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటా వినియోగించులేకపోయింది. ఏపీ 72.2శాతం (715.03 టీఎంసీలు) వాడుకోగా, తెలంగాణ వాడుకున్నది కేవలం 27.8శాతం. ఆరున్నర లక్షల ఎకరాల్లో సాగుకు సరిపోయే 65 టీఎంసీలను తెలంగాణ కోల్పోయింది. 2014 నుంచి 2023 వరకు తాత్కాలిక వాటా ప్రకారం 34 శాతం వాటాను దాదాపుగా బీఆర్‌ఎస్ ( BRS) ప్రభుత్వం వినియోగించింది.
Also Read: CM Revanth Reddy: తొలి దశలో 4 ప్రాంతాల్లో.. అత్యాధునిక గోశాలలు!
కేంద్రానికి ఉత్తమ్ లేఖలు
– గోదావరి, బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)) అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జనవరి 22, 2025న కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులకు, భారత ప్రభుత్వానికి లేఖ. తిరిగి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ మే 28న లేఖ.
– బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2025 మార్చి 3ప సీఎం రేవంత్ రెడ్డి లేఖ
– జూన్ 03, 2025న న్యూఢిల్లీలో జల్ శక్తికి, ఇతర సమస్యలతో పాటు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖ
– జూన్ 13, 2025న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ. ప్రస్తుతం జల్ శక్తి మంత్రిత్వ శాఖ సీడబ్ల్యూసీ సమీక్షలో ఉన్న గోదావరి, బనకచర్ల యొక్క ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని అభ్యర్థన
– పోలవరం ప్రాజెక్టు టీఓఆర్ మార్పులను తిరస్కరించాలని జూన్ 16న లేఖ
ప్రత్యక్ష కార్యాచరణ కరువు
(Telangana) తెలంగాణ రాష్ట్రం నుంచి 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు లోక్ సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ నెలలు గడుస్తున్నది. కేంద్రం నుంచి రాసిన లేఖలకు నామమాత్రపు సమాధానమే వస్తున్నది. అటు ఏపీ ప్రాజెక్టు నిర్మాణంపై దూకుడు పెంచింది. కానీ, అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వంగానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిగాని(Uttam Kumar Reddy ప్రత్యక్ష కార్యచరణ చేపట్టడం లేదు.
ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు (Uttam Kumar Reddyభవిష్యత్‌లో గోదావరి పరివాహక ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తున్నది. ఉత్తమ్ కేవలం లేఖలతోనే కాలం వెల్లదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎంపీలు సైతం నీళ్లపై ఎలాంటి పోరాట పటిమ కనబరచకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోమురంభీం వారసులం, చాకలి అయిలమ్మ పోరాట పటిమ ఉందని చెప్పుకుంటున్నప్పటికీ ఏపీ నీటి దోపిడీపై ప్రత్యక్ష కార్యచరణ తీసుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.