Panchayat Elections: గ్రామ పంచాయతీ మూడవ విడుత ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్‌తో కలిసి కలెక్టర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరగనున్న జిల్లాలోని ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
Also Read: Panchayat Elections: రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల్లోను కాంగ్రెస్‌దే పై చెయ్యి..!
మొత్తం 1,00,372 మంది ఓటర్లు
ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ శ్రీకాంత్, ఈడియం శివ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Also Read: Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

