Panchayat Elections: రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 3,911 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరుగగా ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు సుమారు 2,243 గ్రామ పంచాయతీలను హస్తం పార్టీ కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 11 వందల వరకు గ్రామాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండో విడుతలోనూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. 268 గ్రామ పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు 600 మందికి పైగా గెలుపొందారు. ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల కౌంటింగ్ కొనసాగుతున్నది. పూర్తి వివరాలు ఇవాళ బయటకు వస్తాయి.
Also Read: KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తొలి విడుత కంటే మెరుగ్గా..
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2,872 సర్పంచ్ స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ పార్టీ 1,160 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి 195 గ్రామ పంచాయతీలు దక్కాయి. రెండో విడుతలోనూ అదే తరహాలో పార్టీలకు సీట్లు దక్కాయి. ఫస్ట్ ఫేజ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక వ్యూహాలు అమలు చేసింది. రెండో విడుతలో ఎలాగైనా తమ మద్దతుదారులు విజయం సాధించాలని పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ చేసింది. ఫలితాల తర్వాత అది వర్కవుట్ అయినట్టు కనిపిస్తున్నది. ఇదే స్ట్రాటజీని మూడో ఫేజ్‌లోనూ అమలు చేయాలని చూస్తున్నది.
Also Read: TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

