TG Christmas Celebrations: క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకునే క్రిస్మిస్(Christmas) వేడుకలు ఈ సారి మరింత ఘనంగా జరుపుకునేందుకు సర్కారు నిధులను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సారి మొత్తం రూ. 21 కోట్లను ఖర్చు చేసేందుకు సర్కారు సిద్దమైంది. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో క్రిస్మిస్ విందు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. క్రిస్మిస్ విందుకు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక లొకేషన్ కు రూ. లక్ష, మొత్తం 190 లోకేషన్లకు మంజూరు చేసేందుకు సర్కారు సిద్దమైంది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో మొత్తం 210 లొకేషన్లలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు ఒక్కో లొకేషన్ కు రూ. లక్ష మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం (15వ తేదీ) చివరి తేదీగా అధికారులు వెల్లడించారు.
Also Read: Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!
నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గాల వారీగా ఎన్ని చర్చిలకు ఈ నిధులు మంజూరు చేస్తారన్న విషయంపై సంబంధిత అధికారులు ప్రత్యేక విధివిధానాలను రూపొందించినట్లు వెల్లడించారు. జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి వద్ద, జీహెచ్ఎంసీ ఏరియా అయితే సర్కిళ్ల వారీగా విధులు నిర్వహించే డిప్యూటీ కమిషనర్లకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చునని వెల్లడించారు. సహాయక కోరే చర్చి రిజిస్టర్డ్ చర్చి అయి ఉండాలని, చర్చికి కమిటీ, బ్యాంక్ ఖాతా తప్పక ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు క్రైస్తవులు, చర్చిల పెద్దలు ఫోన్ నెంబర్లు 040-29801130, 040-23391067 లను సంప్రదించవచ్చునని అధికారులు వెల్లడించారు.
Also Read: India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

