Kaleshwaram project (image credit: swetcha rportet or twitter)
Politics

Kaleshwaram project: లక్షకోట్ల ప్రాజెక్టు నాలుగేళ్లలో కుప్పకూలింది.. ఆ పాపం ముమ్మాటికి కేసీఆర్ దే!

Kaleshwaram project: లక్షకోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగేళ్లలోనే కుప్పకూలిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలిపోవడం యావత్ భారత దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత ఆర్థిక విపత్తుగా అభివర్ణించారు. లోపభుఇష్టమైన విధానాలు అవలంభించడంతో గడిచిన రెండేళ్లుగా సివిల్ వర్క్స్ నిరుపయోగంగా మారాయని పేర్కొన్నారు. శాసనసభలో ఆదివారం కాళేశ్వరంపై పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను పెట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలకులు నిపుణుల హెచ్చరికలు బేఖాతరు చేయడంతో పాటు అనుమతులు లేకుండా డిజైన్లు మార్చిన ఫలితంగా నాలుగేళ్ళకే కుప్ప కూలి పోయిందన్నారు.

స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కుడా నమోదు

ఆ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చూపించిన ఈ ప్రాజెక్ట్ కుప్ప కూలి పోవడంతో అది రాష్ట్ర ప్రజలకు పెను భారంగా మరిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్(Brs) పాలనలోనే 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ కు చెందిన ఆరు పియర్లు కూలి పోయాయని ఇదే విషయం ఆ మరుసటిరోజు మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ కుడా నమోదు అయిందన్నారు. అన్నారం, సుందిళ్ళ తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ లతో పాటు వాటి అనుబంధ పంప్ హౌజ్ లకు 21 వేల కోట్లు ఖర్చు చేసినా కూలిపోవడంతో గడిచిన 20 నెలలుగా నిరుపయోగంగా మారిందన్నారు.

 Also Read: Apple iPhones: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.. ఒక బ్యాడ్ న్యూస్ కూడా..

ఈ బ్యారేజ్ పనికి రాదు

నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతో పాటు డిజైన్లలో లోపాలు, పునాదులు బలహీనంగా ఉండడంతో తోనే ఈ ఘోర తప్పిదానికి కారణంగా మారిందని నిపుణులు స్పష్టం చేశారని ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారన్నారు. ఇతర బ్లాక్ లు కూడా ప్రమాదంలో పడ్డాయని నిపుణులు చేసిన హెచ్చరికలు ఎన్.డీ.ఎస్.ఏ నివేదికలో బట్ట బయలు అయ్యాయని, ఇప్పుడున్న పరిస్థితిలో నీటిని నిల్వ చేస్తే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పూర్తిగా పునరుద్ధరించక పోతే అసలు ఈ బ్యారేజ్ పనికి రాదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పిందన్నారు. 2009లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చి కాళేశ్వరం పేరుతో మొదలు పెట్టడమే ఇంతటి వైఫల్యానికి కారణమన్నారు. కేంద్ర జలవనరుల సంఘం అనుమతులకై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏఐబీపీ తోడ్పాటు అందించడంతో అంతర్ రాష్ట్ర చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా మార్చారని ఆయన విమర్శించారు.

ప్రాజెక్ట్ కోసం 11,679 కోట్లు ఖర్చు

2014నాటికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 38,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన ఈ ప్రాజెక్ట్ కోసం 11,679 కోట్లు ఖర్చు పెట్టిందని 30% మేర పనులు కుడా పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకు పెట్టి కొత్తగా గోదావరిపై మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను తెరమీదకు తీసుకొచ్చారన్నారు. 87,449 వేల కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు కాలక్రమంలో 2022 నాటికి కోటి 27 లక్షల కోట్లకు,ఇప్పుడు ఆ మొత్తం కోటి 47 లక్షలకు చేరిందన్నారు. 2015 జనవరిలో అప్పటి ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ కుడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అనుకూలం కాదని ఇక్కడి నుండి మిడ్ మానేరు వరకు ఎత్తిపోతలు అత్యంత ఖరీదు అని చేసిన సిఫారసులు బీఆర్ఎస్ పాలకులు తోసిపుచ్చారన్నారు.

ఉదంతం దేశ చరిత్రలోనే లేదు

ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అప్పటి పాలకులు చెప్పిన దానికి అమలులో జరుగుతున్న దానికి ఎక్కడ పొంతనే లేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో సంవత్సరానికి 195 టీ.యం.సీ ల నీటిని లిఫ్ట్ చేస్తామని అదనంగా 18 లక్షల ఎకరాలను స్థిరకరిస్తామని పేర్కొన్నపటికీ 2019 లో ప్రారంభమై 2023 లో కూలి పోయేనాటికి అంటే ఈ ఐదేళ్ళ వ్యవధిలో లిఫ్ట్ చేసింది మొత్తం 162 టి.యం.సి లు మాత్రమేన అన్నారు. అందులో 32 టి.యం.సి లు సముద్రంలో కలువగా కొండపోచమ్మ,రంగనాయక్ సాగర్,మల్లన్న సాగర్ రిజర్వాయర్ లలో నిల్వ చేయబడిన నీరు కేవలం 13 టి.యం.సి లు మాత్రమే నన్నారు. ఐదేళ్ళ వ్యవధిలో కేవలము 101 టి.యం.సి ల నీరు మాత్రమే ఉపయోగ పడిందన్నారు. అంటే సంవత్సరానికి 20.2 టి.యం.సి ల నీరు మాత్రమే ఉపయోగంలోకి వచ్చిందన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించలేక పోగా నాలుగేళ్ళకె కుప్పకూలి పోయిన ఉదంతం దేశ చరిత్రలోనే లేదని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోసినందుకు ఇరిగేషన్ శాఖ 9793కోట్లు విద్యుత్ శాఖకు బిల్లు బకాయిపడిందన్నారు.

అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత

డీపీఆర్ ఆమోదానికి ముందే కాంట్రాక్టులు అప్పగించడం,డిజైన్ లు లోపభూయిష్టంగా ఉండడం,పూర్తి కాకాముందే పూర్తి అయినట్లు నిర్దారించడం వీటన్నింటికి అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలి అని కమిషన్ తేల్చిచెప్పిందన్నారు. 2023 డిసెంబర్ లో బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ మూడు బ్యారేజ్ లలో నీటిని నిలువ చేయకున్నా రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. అధిక దిగుబడులు కాళేశ్వరంతోటే అని గత పాలకులు ప్రచారం చేసుకున్నారని అటువంటి కాళేశ్వరం నిరుపయోగంగా మారినా రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి అయిందన్నారు. 38,500 కోట్లతో మొదలు పెట్టిన చేవెళ్ల-ప్రాణహిత పూర్తి చేసి ఉంటే కాళేశ్వరం పై పెట్టిన ఖర్చుతో కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా,జే.చొక్కారావు దేవాదుల వంటి ప్రాజెక్టులు పూర్తి అయి ఉండేవన్నారు. కమిషన్ పేరుతో కక్ష్య సాధింపు చర్యలు అంటూ బీ.ఆర్.ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. సభలో చర్చించి క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా నిజాలు వెల్లడించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని,చట్టపరంగా ముందుకు పోతామని వెల్లడించారు.

 Also Read: Indian Traditions: గురువారం రోజు త‌ల‌స్నానం చేయ‌కూడ‌దని తెలుసా.. దీని వెనుకున్న రహస్యం ఇదే?

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్