MLC Kavitha: బీసీలకు ఎంపీ ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటల అనటం తప్పన్నారు. బీసీ(BC) రిజర్వేషన్లపై బీజేపీ(BJP) చిత్తశుద్ధికి ఈటల వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈటల రాజేందర్(Etela Rajender) ఎన్నికలకు వెళ్లవద్దు, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని అంటారన్నవారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మేము క్యాన్సిల్ చేయిస్తామని అంటారు.. ఈటల, బీజేపీ పార్టీ వాళ్లు కోర్టులా, జడ్జిలా అని అడుగుతున్నా.. బిల్లు, రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లే కోర్టులో వెళ్లి క్యాన్సల్ చేయిస్తరంట.. ఇవి ఎంత ద్రోహపూరిత, మోసపూరిత మాటలు అన్నారు. ‘బీసీలపై ఈటల, బీజేపీ వైఖరి ఇదేనా అని అడుగుతున్నా.. మీ అధ్యక్షుడు జీవోను స్వాగతిస్తున్నా అంటాడు.. ఈటల మాత్రం వేరేగా మాట్లాడుతారు.. అసలు ఒక ఉద్యమకారుడిగా పేరున్న ఈటల ఇలా మాట్లాడవచ్చా?.. బీసీ బిడ్డ అయిన మీరు అలా మాట్లాడతారా తక్షణమే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలని’ డిమాండ్ చేశారు.
ఈటల ఇలా మాట్లాడటం ఏంటి?
కాంగ్రెస్ పార్టీ జీవో ఇచ్చి వాళ్లే కేసులు వేస్తారు..రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన వాళ్లు కోర్టుకు పోతామంటారా?..ఇదేం కుట్ర, ఇదేం మోసం అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కోర్టులకు.. జడ్జిలకు ఆర్డర్లు ఎలా ఇస్తారు… వీళ్ల మోసాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమాల నుంచి వచ్చిన ఈటల ఇలా మాట్లాడటం ఏంటి?.. కోర్టుకు వెళ్తాం, ఎన్నికలు క్యాన్సల్ చేయిస్తామని ఎలా చెబుతారు?.. ఓబీసీ ల కోసం మేము వీధుల్లో చేస్తున్న పోరాటం మీకు జోక్ లా కనిపిస్తోందా? గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుపై మాట్లాడరాదా?.. ఇక్కడున్న 8 మంది ఎంపీలు వెళ్లి మోడీ కాళ్లు పట్టుకొని రిజర్వేషన్లు తేవాలని.. అది అడగటం చేతకాదు. కానీ ఎన్నికలకు వెళ్లవద్దని బీసీ బిడ్డలను కన్ ఫ్యూజ్ చేస్తున్నారు.. బీసీలు గెలవటం బీజేపీకి ఇష్టం లేదా? ఎంత అన్యాయం ఇది అని నిలదీశారు.
Also Read: Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!
ఎన్నో ఏళ్లుగా ప్రజలు..
బాకీ కార్డు అనేది బీఆర్ఎస్ రాజకీయ అంశం అని స్పష్టం చేశారు. ప్రజలకు ఇస్తున్న హామీలపై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ బీసీల సమస్యలపై ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు నాకు ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు.. నాకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు బతుకమ్మ(Bathukamma) పండుగను నిలబెట్టుకున్నారని, ప్రభుత్వం రికార్డ్ కోసం బతుకమ్మ చేశారు.. రికార్డుల కోసం కాదు కదా? అని ప్రశ్నించారు. మేము ఎప్పుడు రికార్డుల కోసం పండుగ నిర్వహించ లేదని వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్ కోసం విచిత్ర వింత పోకడలకు పోవటం దురదృష్టకరం అన్నారు. మొదటి నుంచి తెలంగాణ సాంస్కృతిని కాపాడుకునేందుకు ఆరాట పడిన సంస్థ జాగృతి అని స్పష్టం చేశారు.
పంచాయితీల వారీగా జనాభా వివరాలు..
వచ్చే సంవత్సరం జాగృతి ఆధ్వర్యంలో లక్ష మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పోరాటంలో జాగృతి అగ్రభాగాన ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం జీవో ఇచ్చింది.. మరుసటి రోజే కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు. ఇక రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు గ్రామ పంచాయితీల వారీగా జనాభా వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ గ్రామంలో ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికి అవకాశాలు వస్తాయన్నారు. ఇంత సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్, బీజేపీ లు ఏం బాగుపడతాయి?.. తెలంగాణ ప్రజలు వీళ్ల మోసాలను గ్రహించాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. 8న కోర్టు తీర్పు తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. కాళేశ్వరం రిపేర్ విషయంలో పాలిటిక్స్ వద్దని కోరారు.
Also Read: Crime News: హుజురాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్ తగిలి ఉద్యోగి మృతి!