Panchayat Elections: మూడో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, 2,244 గ్రామ పంచాయతీలను(బుధవారం అర్ధరాత్రి వరకు) కైవసం చేసుకున్నది. మొత్తం మూడు విడుతల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. మూడు దశల్లో కాంగ్రెస్ 6,820 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ 3,515 చోట్ల విజయం సాధించింది. బీజేపీ మూడో విడుతల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు.
1,655 మంది విజయం
702 గ్రామ పంచాయతీలతో సరిపెట్టుకున్నది. మూడు విడుదతల్లో ఇతరులు 1,655 మంది విజయం సాధించారు. తొలి విడుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2,331, రెండో విడుతలో 2,245 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది. బీఆర్‌ఎస్ పార్టీ తొలి విడుతలో 1,168, రెండో విడుతలో 1,188 గ్రామ పంచాయతీలో గెలిచింది. బీజేపీ తొలి విడుతలో 189, రెండో విడుతలో 268 స్థానాలు గెలుచుకున్నది. అయితే, మూడు దశల్లో ఇతరులు(వామపక్ష పార్టీలు, టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు) భారీగా విజయం సాధించారు. తొలి విడుతలో 539, రెండో విడుతలో 624 మంది, మూడో విడుతలో 492 మంది విజయం సాధించారు.
కాంగ్రెస్‌లో జోష్
కాంగ్రెస్ పార్టీ మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 6,820 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నది. దీంతో హస్తం శ్రేణుల్లో జోష్ పెరిగింది. వరుస విజయాలు దక్కుతుండడంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని రుజువు అవుతున్నదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Also Read: Panchayat Elections: తుది అంకానికి పంచాయతీ పోరు.. 3వ విడత పోలింగ్‌కి సర్వం సిద్దం!

