Panchayat Elections; మెదక్ ఉమ్మడి జిల్లా లో 3 వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో 7 మండలాల్లో, సిద్దిపేట జిల్లా లో 8 మండలాల్లో సంగారెడ్డి జిల్లాలో 8 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు సంగారెడ్డి కలెక్టర్, ప్రావీణ్య, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట కలెక్టర్ హైమావతి లు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ లతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. బుధవారం జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌తో ఉమ్మడి జిల్లాలో పంచాయతీ పోరు సంపూర్ణంగా ముగియనున్నది.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా లో 3 వ విడతలో 184 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 22 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను162 గ్రామ పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరుగనుంది.1,528 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 307 వార్డుల లు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోను 1,220 వార్డులకు పోలింగ్ జరుగనుంది. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, వెల్దుర్తి,శివ్వంపేట, మాసాయిపేట, కౌడిపల్లి, మండలాల్లో పోలింగ్ జరుగనుంది.
Also Read: West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 234 గ్రామ పంచాయతీలకు గాను 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 1960 వార్డు స్థానాలకుగాను 422 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోను 207 గ్రామ పంచాయతీలకు,1,536 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, డివిజన్లలోని 8 మండలాల్లో సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్, నాగిల్గిద్ద, మానూరు, కంగిటి, కల్హేర్ మండలాల్లో పోలింగ్ జరుగనుంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో 163 పంచాయితీలకు 1432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 13 గ్రామ పంచాయతీలు, 249 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోను 150 గ్రామ పంచాయతీలకు,1182 వార్డు స్థానాలకు బుదవారం పోలింగ్ జరుగనుంది. హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, అక్కన్నపేట దూల్మిట్ట,కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు,మండలాల్లో పోలింగ్ జరుగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు. తదనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు.
Also Read: IPL Auction Live Blog: రూ.30 లక్షల అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కి రూ.14.2 కోట్లు.. ఐపీఎల్ వేలంలో పెనుసంచలనం

