Telangana Govt: సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ
Telangana Govt ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Political News

Telangana Govt: సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ.. ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ!

Telangana Govt: గ్రామ పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. సర్పంచ్‌లకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులు, అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై లోతైన అవగాహన కల్పించేలా శిక్షణా మాడ్యూల్‌ను రూపొందించారు. పైపైన కాకుండా, ఆచరణలో ఉపయోగపడే విధంగా పక్కా పాఠ్య ప్రణాళికతో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సర్పంచ్‌ల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్, కరదీపికను సిద్ధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 12,760 మంది సర్పంచ్‌లకు

గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ శిక్షణలు రూపుదిద్దుకున్నాయి. సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పనిచేసేలా, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాల వారీగా ఈ శిక్షణా తరగతులు జరుగుతాయి. ప్రతి జిల్లాలో 5 బ్యాచ్‌లుగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనుండగా, ఒక్కో బ్యాచ్‌లో కనీసం 50 మంది సర్పంచ్‌లు పాల్గొంటారు. ఒక్కో బ్యాచ్‌కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు.

Also Read: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ.800 కోట్లు సేఫ్?.. ఎందుకంటే

ఒక్కో సర్పంచ్‌కు ఐదు రోజులు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనుండగా, ఒక్కో సర్పంచ్‌కు ఐదు రోజుల పాటు బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం రూ.5వేల వరకు ప్రభుత్వం వెచ్చించనున్నది. ఈ శిక్షణను సమర్థవంతంగా అందించేందుకు మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి, వారికి టీజీఐఆర్డీలో ఇప్పటికే ఓరియంటేషన్ పూర్తి చేశారు. సర్పంచ్‌లకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విధంగా, పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ అంశాలపై శిక్షణ అందిస్తారు. సర్పంచ్ శిక్షణా తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. శిక్షణలో పాల్గొనే సర్పంచ్‌లకు భోజనాలు, వసతి సౌకర్యాలు, శిక్షణా కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా స్పష్టం చేసింది. సర్పంచ్‌లకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం అవుతాయని, పారదర్శకమైన పాలన, సమర్థవంతమైన నిధుల వినియోగం, ప్రజల అవసరాలకు వేగంగా స్పందించే వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మంత్రి సీతక్క నాయకత్వంలో ఈ శిక్షణా కార్యక్రమం గ్రామ స్వరాజ్యానికి దృఢమైన పునాది వేయనుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది.

గ్రామాలు అభివృద్ధి బాట

రాష్ట్రంలోని గ్రామాలను ఇక అభివృద్ధి బాట పట్టనున్నాయి. సర్పంచ్‌లకు నిధులు విధులపై సమగ్ర శిక్షణ ఇస్తుండడంతో వాటి సద్వినియోగంపై వారికి అవగాహన ఉంటుంది. దీంతో సమగ్రంగా నిధులను సద్వినియోగం చేసుకోనున్నారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతులు పరిష్కారం కానున్నాయి. గత కొంతకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి.

Also Read: Telangana Govt: విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు.. మూడో డిస్కమ్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Just In

01

Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Telangana Govt: సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ.. ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ!

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?

Meenakshi Natarajan: సర్పంచ్ పరిస్థితులు రిపీట్ కావొద్దు.. ముఖ్య నేతలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం!