BC Reservations: తెలంగాణ లో రిజర్వేషన్ల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొన్నది. 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్ననేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 18న బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ పేరిట కార్యక్రమం ప్రకటించారు. అయితే ఈ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ వంటి వామపక్షాలు, ఇతర ప్రజా, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ ఒకేసారి బంద్‌కు మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు తెలపడం విశేషం.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలి
కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపిస్తామని చెబుతున్నారు. అయితే రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో ఈ బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. చట్టబద్ధతతోనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని, ఇందుకోసం బీసీ సమాజం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపుఇవ్వడంతో రాజకీయ పార్టీలన్నీ ఒక ప్లాట్ ఫామ్ పైకి వచ్చాయి.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని బీసీ సంఘాల జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జీవో-9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, దానిపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టులో విచారణ జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు.
