CM Jagan
Politics

YS Jagan: పవన్ పై బ్లేడ్‌ల దాడి!.. జగన్ పై రాయి దాడి

Vijayawada: సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. విజయవాడలో బస్సు యాత్ర చేపడుతుండగా ఆయనపై రాయి దాడి జరిగింది. కదులుతున్న బస్సుపై నిలబడి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. అప్పటికే చీకటయింది. ఆ సందర్భంలో ఓ రాయి వచ్చి ఆయన నుదుటికి తగిలింది. ఎడమ కంటికి సమీపంలో ఆయనకు గాయమైంది. వెంటనే ప్రాథమిక చికిత్స చేసుకుని ముందుకు కదిలారు. మరో చోట ఆయన బయటికి వచ్చి అభివాదం కూడా చేశారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు జగన్‌కు తగిలిన గాయాన్ని పరిశీలించి కుట్లు వేశారు.

గాయమైన చోట ఎక్కువగా వాపు ఉండటంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తన యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర తదుపరి షెడ్యూల్ పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఆరా తీసింది. విజయవాడ సీపీతో ఏపీ సీఈశో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడారు. నిందితులను త్వరగా గుర్తించాలని, రేపటిలోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Also Read: అప్పుడు జగన్‌, ఇప్పుడు పవన్.. అంతేనా..?

అప్పుడ కోడికత్తి ఘటన.. ఇప్పుడు రాయి దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గత ఎన్నికలకు ముందే ఎయిర్‌పోర్టులో ఆయనపై కోడి కత్తి దాడి జరిగింది. ఇప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. విచారణకు జగనే హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలకు నెల రోజుల ముందే జగన్ పై దాడి జరగడంపై చర్చ జరుగుతున్నది. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నదా? అనే అంశాలపైనా చర్చిస్తున్నారు. కాగా, ప్రతిపక్షాల కుట్రే అని, ప్రజలు ఎన్నికల్లో సమాధానం చెబుతారని వైసీపీ నాయకులు ఆరోపణల పర్వం మొదలుపెట్టారు.

ఇదే నెలలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులతో మాట్లాడుతూ ‘బ్లేడ్ బ్యాచ్’ అంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి అభిమానితో ఫొటో దిగాలనీ తనకూ ఉన్నదని, కానీ, తన అభిమానుల ముసుగులో బ్లేడ్ బ్యాచ్ వస్తున్నదని తెలిపారు. ఆ బ్లేడ్ బ్యాచ్ తనను, తన సిబ్బందిని బ్లేడ్‌తో చిన్నగా గాయపరుస్తున్నదని చెప్పారు. అందుకే పార్టీలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఎన్నికల ముంగిట్లో పవన్ కళ్యాణ్ వెల్లడి చేసిన ఈ విషయాలు చర్చను రాజేస్తున్నాయి.

Also Read: డేంజర్‌లో ప్రభాకర్ రావు.. ప్రాణానికి ముప్పు ఉందా..?

ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో హింసను కాంక్షించరాదు. హింస ఎట్టిపరిస్థితుల్లోనూ సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ పారదర్శకంగా ఉంటుంది. జగన్‌‌కు జరిగిన ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. జగన్ పై దాడికి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రధాని మోడీ ఖండించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. కేటీఆర్ కూడా జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన స్పందిస్తూ.. రాజకీయ విభేదాలు హింసాత్మకంగా మారకూడదని, ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందామని పిలుపు ఇచ్చారు. హింస ఎప్పటికీ అనర్థమే. అది తాత్కాలికంగా కొంత లబ్ది చేకూర్చవచ్చునేమో కానీ.. స్థూలంగా ప్రజాస్వామిక వాతావరణానికి విఘాతంగా మారుతుంది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?