Sravan on Bandi Sanjay:: మిస్ ఇంగ్లాండ్ కు.. అవమానం
Sravan on Bandi Sanjay( image Ccredit; SWETCHA REPORTER)
Political News

Sravan on Bandi Sanjay: మిస్ ఇంగ్లాండ్ కు.. అవమానం జరిగితే బండి స్పందించరా?

Sravan on Bandi Sanjay: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీకి అవమానం జరిగితే కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandi Sanjay) స్పందించరా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) ప్రశ్నించారు. భారత్ మాతాకీ జై అనే బండి.. కాంగ్రెస్, బీజేపీ ల మధ్య బలమైన బంధం ఉంది కనుకే స్పందించలేదా ? అని నిలదీశారు. తెలంగాణ భవన్ లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందాల పోటీలు భారత సంస్కృతిని కించపరిచేలా జరిగాయని ఆరోపించారు.

ప్రభుత్వ పెద్దలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మెగీ అందాల పోటీల నుంచి అవమానకార పద్ధతుల్లో వైదొలిగిన తీరు రాష్ట్ర ప్రతిష్ట ను మంట గలిపిందన్నారు. వేరే దేశం లో ఎక్కడైనా ఇలాంటిది జరిగితే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసేవారని, ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రభుత్వ పెద్దలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం ఇప్పటికే చెంపలు వేసుకుని మిస్ ఇంగ్లాండ్ కు క్షమాపణ చెప్పి ఉండాల్సిందన్నారు. అందాల పోటీలు సీఎం రేవంత్ కుటుంబ వ్యవహారం కాదు ..కానీ కుటుంబ వ్యవహారంగా మార్చారన్నారు. ఈ కేసు పై హ్యూమన్ రైట్స్ కమిషన్ , ఉమెన్ కమిషన్ సుమోటో గా తీసుకొని ఎందుకు స్పందించలేదన్నారు.

Also Read: Shocking Murder: వృద్ద దంపతుల.. దారుణ హత్య!

మిస్ ఇంగ్లాండ్ వ్యవహారం పై విచారణ లేదు

కనీసం ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రమోషన్ కోసం అందాల పోటీలు నిర్వహించారా ? అని నిలదీశారు. అందాల పోటీల ప్రొటొకాల్స్ ఏమిటో బ్యూరో క్రాట్లు ప్రభుత్వ పెద్దలకు చెప్పారా ? కాంగ్రెస్ నేతలు అందాల పోటీల్లో ఎందుకు చొరబడ్డారని ప్రశ్నించారు. మిస్ ఇంగ్లాండ్ వ్యవహారం పై విచారణ లేదని మంత్రి జూపల్లి అంటున్నారని, ఏ విచారణ జరిపి మంతి అలా అంటున్నారు ?ఏ కమిటీ వేశారు ?ఏ విచారణ చేశారు ? సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టదు ? అని నిలదీశారు.

రైతులు అడిగిన దాంట్లో న్యాయం ఉంది

ఈ ఘటన పై వాస్తవాలు బయటకు వచ్చే దాకా విశ్రమించబోమన్నారు. ఆర్ టీ ఐ చట్టం కింద ఇప్పటికే దరఖాస్తు చేశామని, సోనియా ,ప్రియాంక కూడా ఈ ఘటన మీద స్పందించాలని డిమాండ్ చేశారు. మీనాక్షి నటరాజన్ సాటి మహిళకు జరిగిన అన్యాయం పై స్పందించరా ? అని ప్రశ్నించారు. గద్వాల్ జిల్లా ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల పై పోలీసుల దమనకాండను బీఆర్ఎస్ ఖండిస్తోందన్నారు. రైతులు అడిగిన దాంట్లో న్యాయం ఉందని పేర్కొన్నారు. గద్వాల్ ఘటనలో అతిగా ప్రవర్తించిన పోలీసుల పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా? 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క