Ramchander Rao: యాంటీ ఇండియా ఐడియాలజీ అవార్డులా?
Ramchander Rao (image credit: swetcha reporter)
Political News

Ramchander Rao: యాంటీ ఇండియా ఐడియాలజీ ఉన్నవారికి అవార్డులా? ఇది అత్యంత దుర్మార్గం!

Ramchander Rao: కాంగ్రెస్ ఇటీవల యాంటీ ఇండియా ఐడియాలజీ ఉన్నవారికి ఇందిరా గాంధీ అవార్డులు ఇచ్చిందని, అలాంటి వారికి అవార్డులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియన్ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశం ఇతర దేశాల వస్తువులపై ఆధారపడకూడదని ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు.

Also Read: Ramchander Rao: ఒకరిది కాంట్రాక్టర్ల పాలన ఇంకొకరిది కుటుంబ పాలన.. ఇదేం విచిత్రం..!

2047 వరకు దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యం

అందుకే దేశీయ ఉత్పత్తులు పెరగాలని, అందుకు అనుగుణంగా కృషి చేయాలన్నారు. స్వదేశీ వస్తువులతో పాటు ఆలోచనలు కూడా స్వదేశీ అయి ఉండాలని పేర్కొన్నారు. 2047 వరకు దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లడంలో అందరూ భాగస్వాములవ్వాలని కోరారు. చైనా, అమెరికా తమ ఉత్పత్తులను పెంచి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని వ్యాఖ్యానించారు.

ఏ దేశంపైనా ఆధారపడే పరిస్థితి లేని స్థాయికి ఎదిగేలా

భారత్ కూడా ఏ దేశంపైనా ఆధారపడే పరిస్థితి లేని స్థాయికి ఎదిగేలా మోదీ కృషి చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్ కూడా స్వదేశీ ఆయుధాలతోనే చేపట్టి సక్సెస్ అయినట్లు వివరించారు. ఇదిలా ఉండగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావు ఆధ్వర్యంలో వాల్మీకి మెతార్ సమాజానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌లాల్ బీజేపీలో చేరారు. ఆయనకు రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also ReadRamchander Rao: బీజేపీకి భయపడే సీఎం స్వయంగా ప్రచారానికి దిగారు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Just In

01

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

CPR to Snake: పాముకు కరెంట్ షాక్.. నోట్లో నోరు పెట్టి ఊపిరిపోసిన వ్యక్తి.. రియల్లీ గ్రేట్!

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?