Ramchander Rao: బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అయితే.. కాంగ్రెస్ లో కాంట్రాక్ట్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టుల పేరుతో మంత్రులే గొడవ పడుతున్నారని, కాంట్రాక్టుల పేరుతో మంత్రులు ఏకంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో తుపాకులు పట్టుకుని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులపై దుండగులు దాడులు చేస్తున్నారని, అయినా ప్రభుత్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అందుకే ప్రజలు బీజేపీ వైపు..
పోలీసులపై దాడుల చేసిన వారిని ఎంఐఎం(MOM) నేతలు వెళ్లి పరామర్శిస్తున్నారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు అవకాశమిచ్చారని, ఈసారి జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఇదిలాఉండగా రాంచందర్ రావు అధ్యక్షతన వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ నాయకులు పలువురు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కాగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రధాని మోడీ(Modhi) విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని కొనియాడారు.
Also Read: Baahubali craze: ఖండాంతరాలు దాటిన బాహుబలి మేనియా.. ఇది చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..
మైనారిటీ ఓట్ల కోసమే..
అనంతరం రెహ్మత్ నగర్ లో పాదయాత్ర నిర్వహించి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో తాము గెలవబోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. రెహ్మత్ నగర్ లో కరెంట్, వీధి లైట్లు లేవని, చిమ్మ చీకటిలో ఈ ప్రాంతం ఉందన్నారు. జూబ్లీహిల్స్ మొత్తం అంధకారాన్ని తలపిస్తోందన్నారు. మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్(Azharuddin) కు మంత్రి పదవి ఇచ్చారని, మైనారిటీలతో కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. డబ్బు, ప్రలోభాలు, బెదిరింపులతో ఓట్లు వేయించుకోవాలని భావిస్తున్నాయని, అందుకే హిందువులంతా ఏకమై ఈ కుట్రలను తిప్పికొట్టాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
Also Read: Telangana Congress: జూబ్లీహిల్స్‌లో కీలక అస్త్రాలు.. సీఎం ప్రచారంతో కాంగ్రెస్‌లో జోష్
