Krishna Mohan Reddy ( image credit: swetcha reporter)
Politics, నార్త్ తెలంగాణ

Krishna Mohan Reddy: గద్వాలలో వేడెక్కిన రాజకీయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేకు అగ్నిపరీక్షే!

Krishna Mohan Reddy: నడిగడ్డ రాజకీయాలు మరొకసారి వేడెక్కుతున్నాయి. రానున్న స్థానిక సంస్థల నాటికి ఆ వేడి మరింత రాజుకోనుంది. గద్వాల ఎమ్మెల్యే పార్టీ మార్పుపై గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కిందిస్థాయి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ భవిష్యత్తును ఊహించుకొని తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత పార్టీ పెద్దల సూచనతో పదవి వస్తుందని గంపెడు ఆశతో ఉన్నారు.

 Also Read: Dr. Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!

ఎమ్మెల్యే అభివృద్ధి మంత్రం

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Krishna Mohan Reddy) రాజకీయాలలో అభివృద్ధి మంత్రాన్ని పట్టుకున్నారు గత రెండు పర్యాయాలుగా గద్వాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికగా అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లాలో ఏకచత్రాధిపత్యం కొనసాగించారు. 2023 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఫారం పొంది గద్వాల నుంచి పోటీ చేశారు.

జడ్పీ చైర్ పర్సన్ గా సరిత సైతం అదే పార్టీ నుంచి గద్వాల వేదికగా రాజకీయాలు చేయగా పార్టీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేయగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మొదట్లో సరిత చుట్టూ రాజకీయాలు నడిచేవి. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కేడర్ కు పనులు కాకపోవడంతో ఎమ్మెల్యే శిబిరం ఢీలాపడడంతో తన అనుచరుల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల ఆశల కనుగుణంగా పనిచేసేందుకు ప్రభుత్వ పెద్దలను కలుస్తూ అభివృద్ధి పనులు సాధిస్తున్నానని ఎమ్మెల్యే చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకుల ఫోకస్

రానున్న స్థానిక సంస్థలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ద్వితీయ శ్రేణి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బిఎస్ కేశవ్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మున్సిపాల్టీలో పలు సమస్యలను తన దృష్టికి తెచ్చినా వారికి చైర్మన్ ను కలవాలని,అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయినప్పటికీ గద్వాల అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితకు మద్దతు తెలుపుతూ తన వర్గం కౌన్సిలర్లతో కలిసి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తుండగా, ఎమ్మెల్యే ఉండగా తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తుతాయని తన కేడర్ కు సైతం బి ఫామ్ లు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు న్యాయం జరగడం లేదనే కారణంతో, బలమైన బీఆర్ఎస్ పక్షాన నిలవడం ద్వారా ప్రజల మద్దతు లభిస్తుందనే ఉద్దేశంతో తిరిగి బీఆర్ఎస్ లో ఈనెల 13న కేటీఆర్ సమక్షంలో తన మద్దతుదారులైన నలుగురు మాజీ కౌన్సిలర్లతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు.

పార్టీ అభివృద్ధి పై ఫోకస్ ఏది

మరోవైపు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మంత్రుల చేతుల మీదుగా ఇటీవల డబుల్ బెడ్ రూమ్ లు లబ్ధిదారులకు పంపిణీ చేయించడంతో పాటు ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇళ్ళను నియోజకవర్గానికి కేటాయించుకున్నారు. రానున్న రోజులల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని తన క్యాడర్ కు భరోసానిస్తూ స్థానిక ఎన్నికలలో అభివృద్ధి చేసే వారిని ఆదరించాలని ప్రజలను కోరుతున్నారు. కాకపోతే నేను పార్టీ మారలేదని పలు వేదికల మీద పేర్కొంటున్నా తాను ఎంచుకున్న పార్టీ అభివృద్ధికి సైతం పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఒకవైపు అభివృద్ధి మంత్రం జపిస్తున్నా రాను రాను కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నడంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటే అద్దె ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉందని ఎమ్మెల్యే పేర్కొన్న సంఘటనలు ఉన్నాయి.

మరోవైపు స్పీకర్ నోటీసులకు సైతం ఎమ్మెల్యేగా తాను టెక్నికల్ గా బీఆర్ఎస్ లోనే ఉన్నానని, పలు ఆధారాలను తనకు ఇచ్చిన నోటీసులో సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో మాత్రమే రాష్ట్ర సీఎంను, మంత్రులను కలుస్తున్నానని చెబుతున్నారు. ఈనెల 13న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారని, ఈ సందర్భంగా పలు చేరికల తో పాటు నియోజకవర్గ ఇన్చార్జి ప్రకటన ఉండనుందని ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై కేటీఆర్ ప్రకటన ఎలా ఉండబోతుందోనని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు భావిస్తున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పలు కార్యక్రమాల ద్వారా గద్వాల బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మరి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీ సంస్థాగత అభివృద్ధికి కృషి చేస్తారోనని ప్రజలు అయోమయంలో ఉన్నారు. Gadwal politicsరానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పిటిసి అభ్యర్థుల ఎంపిక, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుత రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యేకు అగ్ని పరీక్షగా మారనుంది.

 Also Read: Viral Video: కెనడా మెట్రో స్టేషన్‌లో.. అలాంటి పని చేస్తూ.. కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి

Just In

01

Minister Seethakka: అంగ‌న్వాడీల‌కు ఫుడ్ గ్యాప్ ఉండోద్దు.. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

Kavitha: హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ మోసం.. కవిత కీలక వ్యాఖ్యలు

Thummala Nageswara Rao: యూరియా పంపిణీలో ఇబ్బందులు రావొద్దు.. మంత్రి తుమ్మల ఆదేశాలు

Hyderabad: గణేశ్ నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌‌లో భారీగా వ్యర్థాలు.. ఎంత సేకరించారో తెలుసా?

CM Revanth Reddy: 100రోజుల్లో మేడారం అభివృ‌ద్ధి పనులు పూర్తి చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు