BRS vs Kavitha (imagecredit:twitter)
Politics, తెలంగాణ

BRS vs Kavitha: గులాబీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇక జాగృతి.. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం

BRS vs Kavitha: కవితతో తాడోపేడో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నవారు. ఆమె చేసే విమర్శలకు ప్రతి విమర్శలు చేయబోతున్నారు. కవితను ఇకపై రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలని గులాబీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆమెను ఇలాగే వదిలేస్తే కవిత చేసే ఆరోపణలు, విమర్శలతో పార్టీకి మరింత నష్టం జరుగుతుందని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్(BRS) అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు వరుస కౌంటర్స్ ఇచ్చారు. కాంగ్రెస్ డైరెక్షన్‌లో కవిత పనిచేస్తున్నారని బీఆర్ఎస్ భావించి పార్టీ నేతలు ఎదురుదాడి చేయాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా నేతలు స్పందించడం, కవిత విమర్శలపై కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గులాబీ నేతలే టార్గెట్‌గా కవిత విమర్శలు 

ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. గులాబీ నేతలను టార్గెట్‌గా కవిత వరుస ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు పార్టీలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు కేటీఆర్*(KTR), హరీశ్‌రావు(Harish Rao)తో పాటు పార్టీ సీనియర్ నేతల టార్గెట్‌గా విమర్శలకు పదును పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంపై వెంటనే స్పందించారు. ‘కర్మ హిట్స్ బ్యాక్ అంటూ’ తన ‘ఎక్స్’ ఖాతాలో కవిత పోస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మెదక్‌లో మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత చేసిన విమర్శలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఆయనతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు టార్గెట్ చేయడం బీఆర్ఎస్ పార్టీలో నేతల్లో ఆందోళన మొదలైంది.

ఇప్పుడు డైరెక్ట్‌గా ఎటాక్ 

కేసీఆర్‌కు కవిత రాసిన లేక లీక్ తర్వాత నుంచి విమర్శలకు పదును పెట్టడంతో పాటు దూకుడుగా ముందుకెళ్తున్నారు. డైరెక్ట్‌గా కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు సీనియర్ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ కంటే ముందుగానే కేటీఆర్, సంతోష్ కుమార్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. దీంతో సెప్టెంబర్‌లో కవితను బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై తెలంగాణ రాజకీయాలతో పాటు బీఆర్ఎస్‌లో సైతం తీవ్ర చర్చ జరిగింది. పరోక్షంగా కొద్ది రోజులు విమర్శలు చేసిన ఆమె, ఆ తర్వాత డైరెక్ట్‌గా ఎటాక్ మొదలు పెట్టింది. విమర్శల వెనుక కారణాలు ఏంటన్నదానిపై చర్చ జోరుగా సాగుతుంది. దీనికి తోడు విమర్శల అసలు ఉద్దేశం వేరే ఉందన్న అభిప్రాయాలు కూడా బీఆర్ఎస్‌లో చర్చకు దారితీశాయి.

Also Read: SriDevi: సీనియర్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్న కోర్టు బ్యూటీ.. ఒకేసారి నాలుగు సినిమాలు!

టార్గెట్ కేసీఆరేనని గులాబీ నేతల అభిప్రాయం 

తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యావ్యవస్థపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 12 ఏళ్లలో సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏం చేయలేదని, నిజమైన భావోద్వేగం ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేవని కవిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత అసలు టార్గెట్ కేసీఆర్‌తో పాటు.. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయటమేనన్న అనుమానాన్ని గులాబీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్‌ను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తే ప్రజల్లో తనకు ఇబ్బంది అవుతుందని కవిత భావిస్తున్నారని, అందుకే పరోక్షంగా విమర్శలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన చులకన చేసే విధంగా కవిత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారన్న చర్చ బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతుంది. తద్వారా కేసీఆర్ పాలనలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి కవిత తీసుకువెళ్తున్నారని భావించి నేతలు విమర్శలకు పదును పెట్టినట్లు సమాచారం. ఇంతకు ముందు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చుకున్న కవిత ఒక్కసారిగా పరోక్షంగా ఆరోపణలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్నిసార్లు కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా చెబుతూనే.. ఆయన క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులను టార్గెట్ చేయడం కవిత రాజకీయ వ్యూహంలో భాగమేనా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

కాంగ్రెస్ డైరెక్షన్‌లో అంటూ బీఆర్ఎస్ విమర్శలు 

ఏ పార్టీ నేతలు అయినా అధికార పార్టీ చేస్తున్న తప్పును ప్రతిపక్షాలు ఎత్తిచూపుతూ ఉంటాయి. కానీ కవిత ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాటు.. బీఆర్ఎస్ కీలక నాయకులను డైరెక్ట్‌గా అటాక్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ డైరెక్షన్‌లో కవిత నడుస్తున్నారన్న విమర్శలకు బీఆర్ఎస్ పదును పెట్టింది. హరీశ్ రావుపై మెదక్‌లో కవిత చేసిన విమర్శలకు కౌంటర్‌గా మెదక్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కవిత కాంగ్రెస్ కోవర్ట్ అంటూ డైరెక్టర్ అటాక్ చేశారు. కవిత త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ బీఆర్ఎస్ విమర్శలకు పదును పెట్టింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఒక అడుగు ముందుకేసి కవితను రాక్షసితో పోల్చారు. ఇక కవితపై ఇదే దూకుడుతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించి నేతలు సైతం కౌంటర్ ఎటాక్ చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతున్నది. కవిత చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కేసీఆర్, కేటీఆర్ భావనకు వచ్చినట్లు సమాచారం. దీంతో కవిత ఆరోపణలకు గట్టిగా బదులివ్వాలని పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో గతానికి భిన్నంగా బీఆర్ఎస్ నేతలు విమర్శలకు పదును పెట్టినట్లు తాజాగా చేసిన విమర్శలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ కూతురుగా కవితను గౌరవిస్తామని, రాజకీయంగా మాత్రం ప్రత్యర్థిగానే చూస్తామని గులాబీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎలా కౌంటర్లు ఇస్తారో.. కవితకు సైతం అదే స్థాయిలో కౌంటర్లతో సమాధానం చెప్పబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఉద్యమ సమయం నుంచి ఉమ్మడిగా కలిసిన నేతలు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారడం రాజకీయ ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Also Read: Global Summit Telangana: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు స్థల పరిశీలన చేసిన ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క

Just In

01

HMDA: ముగిసిన హెచ్ఎండీఏ ప్రీ బిడ్ మీటింగ్.. ప్లాట్ల వేలానికి భారీ స్పందన

Delhi Car Blast: 2021 నుంచే కుట్ర.. 6 నగరాల్లో డీ6 మిషన్.. లేడీ డాక్టర్ ప్లాన్ రివీల్!

Army Chief Upendra Dwivedi: బ్లాక్‌మెయిలింగ్‌కు భారత్ భయపడదు.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్..!

Ginning Mills Strike: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు.. ఆందోళనలో అన్నదాతలు

Hyderabad Tragedy: కడుపులోనే కవలలు మృతి.. కాసేపటికే భార్య మరణం.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?