Etela Rajender (imagecredit:swetcha)
తెలంగాణ

Etela Rajender: హైదరాబాద్ ట్రాఫిక్ పై కేంద్ర మంత్రి గడ్కరీకి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి..!

Etela Rajender: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పలు జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తయ్యేలా చూడలని, ఆలస్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender), బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy), ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel) తెలిపారు. ఈమేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari)ని నాగపూర్ లో కలిసి హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఆలస్యమవ్వడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి వివరించారు.

పెరుగుతున్న జనాభ 

కోటికి పైగా ఉన్న జనాభా, వచ్చిపోయే మరో అరకోటి మంది ప్రజలతో హైదరాబాద్(Hyderabad) విశ్వనగరం నిత్యం రద్దీగా ఉంటుందని, సకాలంలో పనులు పూర్తవ్వకపోవడం వల్ల ప్రజలు ట్రాఫిక్ జామ్ తో అష్ట కష్టాలు పడుతున్నారని వివరించారు. ఆఫీసులో పనిచేసే సమయం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే సమయమే ఎక్కువ ఉందంటూ ప్రజలు వాపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మాలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం అటు కేంద్రం, అటు రాష్ట్రం ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నా పనులు నత్తనడక నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారంటూ ఈటల నితిన్ గడ్కరీకి వివరించారు. వరంగల్ హైవేలో నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్, నిజామాబాద్ హైవేలో నిర్మిస్తున్న కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

Also Read: New Advanced Bus: 3 కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటు.. నగరంలో నలువైపులా ఉండేలా ప్లాన్

అధికారులతో సమీక్ష 

కాగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారని ఈటల రాజేందర్ తెలిపారు. బాలానగర్-నరసాపూర్ హైవేలో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ఆ రూట్ లో కూడా ఒక ఫ్లైఓవర్, నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుంచి అమరావతి వరకు కొత్త హైవే నిర్మాణం జరగుతోందన్నారు. ఆ రూట్ కూడా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాగర్ ఎక్స్ రోడ్ వైపు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి మంజూరు చేయాలని మంత్రిని కోరగా ఒప్పుకున్నారని ఈటల తెలిపారు. త్వరలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి ప్రకటిస్తామన్నారని తెలిపారు.

Also Read: BRS Plans: జూబ్లీహిల్స్ ఫలితంపై 18న గులాబీ నేతల భేటీ.. కేడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు?

Just In

01

Nepalese Gangs: బీ కేర్ ఫుల్.. నేపాలీలను పనిలో పెట్టున్నారో.. అంతే సంగతులు..!

Nizamabad News: సీపీ ఆదేశాలతో దాడి చేసిన నేరస్తుడు వినయ్ గౌడ్ పై కేసు నమోదు

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్ విస్తరణకు మళ్లీ స్టడీ.. రేసులో విజయశాంతి రాజగోపాల్ రెడ్డి..!

Saudi Bus Accident: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు దుర్మరణం