MP Mallu Ravi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చొద్దని,నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి పెట్టాలని నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి (MP Mallu Ravi) డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మల్లు రవి విలేఖరులతో మాట్లాడారు మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద చర్చకు కూడా అవకాశం ఇవ్వబోమని పార్లమెంట్ ప్రారంభం కావడానికి ముందే ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. పార్లమెంటు కార్పోరేట్ సంస్థల కోసం, పెద్దపెద్ద వ్యాపారుల కోసం, ధనవంతుల కోసంఉండాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: MP Mallu Ravi: ఇండియా కూటమి ఎంపీల అరెస్టుపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం!
పేదలకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలి
స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించేటప్పుడు కూడా పార్లమెంటు ఉన్నదని, ఆ రోజుల్లో కార్పొరేట్ సంస్థల గురించి, ధనవంతుల గురించి మాట్లాడడం జరుగుతుండేవని గుర్తుచేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటును సకల జనుల సమగ్ర అభివృద్ధి కోసం మాట్లాడేటటువంటి ఒక వేదికగా రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకున్నామన్నారు . పేదలకు న్యాయం చేసే దిశగా ఆలోచించాలన్నారు. ఈ కొత్త బిల్లు ద్వారా పేద ప్రజల నోటి దగ్గర ఉన్న అన్నం తీసేసినట్టు అవుతుందన్నారు.
Also Read: Telangana Jagruthi: కవిత జాగృతిపై గులాబీ కుట్రలు? కర్త, కర్మ, క్రియ ఆ మాజీ మంత్రే!

