Telangana Jagruthi: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులపై కసరత్తును ప్రారంభించింది. అన్ని మున్సిపాలిటీల్లో పోటీకి ఆసక్తి ఉన్న నేతలను రంగంలోకి దింపబోతుంది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం ఉండటంతో అలర్టు అయింది. జాగృతి పొత్తుతో వెళ్లేందుకు సిద్ధమైన ఏఐఎఫ్బీ పార్టీ నేతలతో గులాబీ పార్టీకి చెందిన ఓ కీలక నేత సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య పొత్తుపొవడకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. చివరికీ ఆ నేత చర్చలు సఫలం కాకపోవడంతో మద్దతుగా ప్రచారం పైకి చేసినా అంతర్గతంగా సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
6 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ
బీఆర్ఎస్ పార్టీకి ( BRS Party) రాజీనామా చేసిన తర్వాత ప్రజల్లోకి కవిత వెళ్తుంది. తొలిసారి ఆమె ప్రత్యక్షంగా పోటీకి సిద్ధమైంది. తెలంగాణ జాగృతితో యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ పార్టీ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)తో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. సింహం గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటుతామని ప్రకటించింది. అయితే సింహం గుర్తుకు ప్రజల్లో ఆదరణ ఉండటం, ఆ పార్టీతో కలిసిపోటీ చేసిన పార్టీలకు సైతం కలిసి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అయితే జాగృతికి ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీచేస్తే గులాబీపార్టీకి నష్టమని భావించిన ఆపార్టీకి చెందిన మాజీ మంత్రి, పార్టీ ముఖ్యులలో ఒకరైన కీలక నేత ఏఐఎఫ్బీ లో ఉన్న ఇద్దరు సన్నిహిత రాష్ట్రనేతలతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. సుమారు 6 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అందుకు ఆర్థికసహకారంతో పాటు మళ్లీ బీఆర్ఎస్ వస్తే పనులు సైతం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అందుకు వారు కొంత సానుకూలం వ్యక్తం చేసినప్పటికీ ఆపార్టీ జాతీయకమిటీ మాత్రం ససేమీర అన్నట్లు సమాచారం. అయినప్పటికీ చివరివరకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ నేత ఎందుకు ఈ ప్రయత్నం చేశారనేది ఇప్పుడు చర్చకుదారితీసింది.
Also Read: Telangana Jagruthi: మున్సిపోల్స్ బరిలో జాగృతి.. గులాబీ గెలుపోటములపై కవిత ప్రభావం?
మెజార్టీ స్థానాలపై ఫోకస్
మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. అయితే కవిత పోటీతో ఆపార్టీపై ఎఫెక్టు పడే అవకాశం ఉంది. గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన సమయంలో జాగృతిలో పనిచేసిన యువత ఉండటం, మహిళల్లో సైతం ఆదరణ ఉండటంతో ఆశించిన ఫలితాలు రావేమోనని అందుకే ముందస్తుగా కట్టడిలో భాగంగానే ఏఐఎఫ్బీ నేతలతో ఆ నేత చర్చలు జరిపినట్లు సమాచారం. కవిత మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయంగా స్ట్రంగ్ అవుతుందని, ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నంలో భాగంగానే సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ఏఐఎఫ్బీ పార్టీని దూరం చేస్తే కవితను కట్టడిచేయవచ్చని, మరోపార్టీతో కలిసి పోయినా ఆమె ప్రభావం ఉండదని భావించే ఈ వ్యూహాలు రచినట్లు సమాచారం. ఇలా జరుగుతుందని కవిత సైతం ముందే గ్రహించి వారి జాతీయ నాయకత్వంతోనే స్పష్టమైన హామీ తీసుకున్నట్లు సమాచారం. అందుకే వారితో బుధవారం రాత్రి కండువాలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
జాగృతికి ప్రచారం చేయాలి
ఆర్ఎస్ పార్టీకి సహకరించాలిచివరకు సంప్రదింపులు చేసిన ఓ మాజీ మంత్రి.. పోటీచేసిన స్థానాల్లో జాగృతి నేతలకు సహకరించొద్దని, లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని కోరినట్లు సమాచారం. అయితే ఏఐఎఫ్బీ నాయకత్వం మాత్రం జాగృతికి ప్రచారం చేయాలని గెలుపుకోసం పనిచేయాలని పార్టీ ఆదేశాలను పాటించాలని ఆదేశించినట్లు సమాచారం. చివరకు సంప్రదింపులు ఫలించకపోవడంతో ఆ నేత నిరాశకు లోనైట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కవిత మాత్రం సింహంగుర్తుపై పోటీకి ముందుకు వెళ్తుంది. ఏఐఎఫ్బీ నేతలతో సీట్లసర్దుబాటు సైతం చేసుకున్నట్లు సమాచారం. బీఫారాలు శుక్రవారం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న జాగృతి ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.
Also Read: Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

