Damodar Reddy: రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగతంగా కించపరిచేలా విలువలు లేకుండా మాట్లాడటం సరికాదని, మర్రి జోకర్ లా మారారని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(Damodar Reddy)మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని తన నివాసంలో ఎంఎల్సీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఓ కొడుకుగా తన అభిప్రాయాలు తీసుకుంటే తప్పేంటని, తానూ ఎంఎల్సీనని అన్నారు. గాలికి వచ్చిన మర్రి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే డిపాజిట్ రాలేదని, తనకు 40వేల ఓట్లు వచ్చాయన్నారు. తాను ఎక్కడ, ఎప్పుడు అవినీతి చేయలేదన్నారు. మర్రి పదేళ్లు నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని, ప్రజల కోసం కాకుండా రియల్టరకు అనుకూలంగా పనుకు చేశారన్నారు. చెరువులో కోటి రూపాయకతో మహిళా శక్తి భవనం చెరువును, ఆర్టీఏ ఆఫీసును, పద్నాలుగు కిలో మీటర్ల దూరంలో ప్రజలకు అనుకూలంగా లేకుండా కట్టించారన్నారు. మర్రి ప్రజల అదృష్టానికి ఓడిపోయాడని, నాగర్‌కర్నూల్ ను శ్మశానంగా చేశాడని ఆరోపించారు.
Also Read: Jogulamba Gadwal: యూరియా కోసం తప్పని తిప్పలు.. చెప్పులతో క్యూ
ప్రజలకు తెలుసు
ఎర్రగడ్డ, హౌజింగ్ బోర్డులో రోడ్లు తవ్వి వదిలేశారని, ప్రతి ఊరిలో పనులు మంజూరు ఇచ్చారని, పని చేయలేదన్నారు. కొల్లాపూర్ చౌరస్తా, తెలకపల్లిలో భూ దందాలో పాత్ర ఏంటో చెప్పాలన్నారు. ఓడిపోయి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, తన కొడుకు మాస్టర్స్ డిగ్రీ, పీజీ అమెరికాలో చదివాడని డాక్టర్ గా సేవలు చేశారన్నారు. మర్రికి నల్లమట్టి రెడ్డి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసన్నారు. వట్టెం, పోతురెడ్డిపల్లి గుట్టల్లాంటివి అడ్డగోలుగా తవ్వారని, హైదరాబాదులో కొండకల్ భూ వివాదంలో ఉన్నారన్నారు. GSTలో 500కోట్లు పెనాల్టీ పడిందని అన్నారు. మర్రికి మతిభ్రమించిందేమో అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అన్నడు..తాము సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి పార్టీలోకి వద్దన చెప్పామని, ఇటీవల ఓ మంత్రికీ కాంగ్రెస్ పార్టీలో చేరతానని అడిగాడన్నారు. తాము మర్రి చేరికను అడ్డుకున్నామన్నారు. మర్రి రేపు ఏ పార్టీలో ఉంటారు తెలియని పరిస్థితి ఉందన్నారు. మర్రికి డబ్బులున్నయి కాని జ్ఞానం లేదని, బ్రోకర్ పని చేశారన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిని పప్పు అంటున్నావని, మరి ఆ పప్పుతోనే ఓడిపోయావ్ నీవెంత పెద్ద పప్పువో ప్రజలకు తెలుసన్నారు.
పరిజ్ఞానం లేదు
మర్రి చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి అన్నారు. రాజకీయాల్లో నాయకులు బజారులో పడొద్దని హితవు చెప్పారు. పదేండ్లు జక్కా లేకుంటే రాజకీయం నీవు చేస్తుంటివా జక్కాను వాడుకుంటివి వదిలేస్తివి అన్నారు. జూనియర్ కాలేజి నూతన భవన పనులకు CSR అగ్రిమెంట్ స్టేజిలో క్యాన్సల్ చేయించారన్నారు. ప్రజా నాయకులుగా ఎదుటివారు మనలను చూసి నేర్చుకోవాలన్నారు. తొలిసారి తెలంగాణ ఉద్యమం వల్ల గెలిచారని, రెండోసారి నా వల్ల గెలిచావని అన్నారు. జక్కా, దామోదర్ రెడ్డి, నాగం ఇలా అందరినీ వాడుకున్నావన్నారు. నీ స్టాండ్ ఏంటని నిలదీశారు. ఎదుటివాడిని గోకవద్దని, పైసలున్నయ్ కాని పరిజ్ఞానం లేదన్నారు. ప్రజలు అంతా గమనిస్తుంటరని అన్నారు. ఎమ్మెల్యే తండ్రి చాటున రాజకీయాలు చేస్తే నీవెవరి చాటున రాజకీయం చేశావు. జక్కా ఎవరు మరి చెప్పు అన్నారు. ఇంకోసారి సంస్కారంగా మాట్లాడు అన్నారు. ఎవ్వరు నిన్ను నాగర్‌కర్నూల్ లో నమ్మరన్నారు. యూరియా యుద్ధాల వల్ల ఆలస్యం అయ్యిందని, దేశమంతా ఈ సమస్య ఉందన్నారు.
మర్రిది వ్యాపారాత్మక ధోరణి
నేను ఎంఎల్సీని నన్ను అడిగేటందుకు నీవెవరు అని ప్రశ్నించారు. ఎదుటి వాళ్లను అవమానకరంగా మాట్లాడకూడదని, రాజకీయంగా విమర్శించాలన్నారు. జెడ్పీ స్కూల్ గ్రౌండ్ ను షాపింగ్ మాల్‌కు ఇచ్చేలా చేశారని, ఇప్పుడున్న క్యాంటీన్ అనుమతులు లేకుండా కట్టావ్ మున్సిపాల్టీకి టాక్స్ కూడా చెల్లించవని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మటన్ మార్కెట్, వెటర్నరీ ఆస్పత్రి స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కట్టించావని, 18రోడ్లు సగం చేసి వదిలిపెట్టాని, గుడ్లనర్వ వద్ద బ్రిడ్జ్, నల్లవెల్లి రోడ్డు తవ్వి వదిలారని, డివైడర్ కట్టడం వల్ల వ్యాపారం దెబ్బతిందన్నారు. మర్రిది వ్యాపారాత్మక ధోరణి అని, డబ్బులతో ఏదైనా చేయాలనుకుంటున్నాడని అన్నారు.కాని ఒక్క రూపాయి ఇచ్చే గుణం లేదన్నారు. మాకు రాజకీయ విలువలు ఉన్నాయన్నారు. పదేళ్ల రాజకీయాలకే ఇలా మారారని, నిన్ను తప్పక విమర్శించాల్సిన పరిస్థితి కల్పించావన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలపాలని మీడియా ముందుకొచ్చా అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ రమణ కాంగ్రెస్ నాయకులు కోటయ్య, హబిబ్, హబీబ్, బండ పర్వతాలు, జక్క రాజు, కావలి శ్రీను, సుబ్బారెడ్డి, నిజాం, తీగల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Also Read: OTT Crime Thriller: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. వరుస హత్యలు చేసిందెవరు?