Uttam Kumar Reddy: హరీష్ రావు పై రెచ్చిపోయిన మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy (imagecredit:twitter)
Political News, Telangana News

Uttam Kumar Reddy: హరీష్ రావు పై రెచ్చిపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..?

Uttam Kumar Reddy: మాజీ మంత్రి హరీశ్ రావు అబద్ధాలను ప్రచారం చేయడం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) హెచ్చరించారు. హనుమకొండలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి(MLA Donthi Madhava Reddy) నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు తాము పోరాడుతున్నామన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌(Banakacharla Project) పై కేంద్రానికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశామని, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశామన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమని స్పష్టం చేశారు. నీటి పంపకాల పంచాయితీలో మంత్రి హోదాలో హాజరైన ఏకైక వ్యక్తిని తానే అని గుర్తు చేశారు. 22 నెలల్లో కాళేశ్వరం ప్రాజక్ట్(Kaleshwaram Project) నయా పైసా పనికి రాలేదని అన్నారు.

గోదావరి జలాల విషయంలో..

హరీశ్ రావు(Harish Rao) మంత్రిగా ఉన్నప్పుడే గోదావరి జలాలను ఆంధ్రాకు అప్పజెప్పారని విమర్శించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. బనకచర్లకు కాంగ్రెస్(Congress) వ్యతిరేకమని మొదటి నుండి చెబుతున్నామని అన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, బీఆర్ఎస్(BRS) కట్టిన ఏకైక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కూలిపోయిందని సెటైర్లు వేశారు. పదేళ్లలో తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తలేదని, గోదావరి జలాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పారు. హరీశ్ రావు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

Also Read: Inspirational Story: సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసి.. అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు

అధికారులతో రివ్యూ..

ఇక, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ పనులను పునరిద్ధరిస్తామని ఉత్తమ్(Uttam) పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్‌(DPR) సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నీటపారుదల శాఖ ఆధ్వర్యంలోని ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్‌ను అందిస్తామన్నారు. అందుకు అనుగుణంగా శాఖ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. B. R. Ambedkar) సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాత ప్రతిపాదన ప్రకారం తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లి ద్వారా చేవెళ్లకు నీరు అందించే యోచన చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుండి 71 కిలోమీటర్ల మేర దూరం ఉన్న కాలువ పనుల్లో ఇప్పటికే 45 కిలోమీటర్ల దూరం పూర్తి అయ్యాయన్నారు.

Also Read: BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు ఇచ్చిన సలహా ఇదే!

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..