BC reservation: సుప్రీంకోర్టుకు వెళ్దామా?
హైకోర్టు గడువు కోసం వెయిట్ చేద్దామా?
న్యాయనిపుణులతో సర్కార్ భేటీ
42 శాతం రిజర్వేషన్లపై చర్చ
ముఖ్య నేతలతోనూ సీఎం మీటింగ్
సుప్రీంకోర్టుకు వెళ్లాలంటూ అత్యధిక నేతల రిక్వెస్ట్
తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC reservation) కల్పించే వ్యవహారంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? లేదా హైకోర్టు ఇచ్చిన గడువు వరకు వెయిట్ చేయాలా? అని కసరత్తు చేస్తున్నది. ఇదే అంశంపై శనివారం ప్రభుత్వ పెద్దలు న్యాయ నిపుణులతోనూ తోనూ చర్చించారు. పార్టీ లీడర్లు, ప్రభుత్వంలోని ముఖ్యులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే మెజార్టీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని తమ అభిప్రాయాలను తెలిపినట్లు సమాచారం. దీంతో సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన పిటిషనర్లు సుప్రీం కోర్టులో ముందుగానే కేవియట్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం సుప్రీం కు వచ్చిన.. తమ అభ్యర్ధనలు, వాదనలను కూడా పరిశీలనలోకి తీసుకోవాలని పిటిషనర్ సుప్రీం కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్, జీవో 9 మీద స్టే ఇచ్చిన నేపథ్యంలో తదుపరి చర్యల గురించి ప్రభుత్వం వివిధ కోణాల్లో అధ్యయనం చేస్తున్నది. జీవో 9 అమలుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం గమనార్హం.
ఫర్ ఫెక్ట్ గా ప్రాసెస్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తన్న ప్రభుత్వం..స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6 శాతం ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం వివరించనున్నది. దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం చీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
పెండింగ్ బిల్లులపైనా పరిశీలన!
రాష్ట్రపతి, గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఆర్డినెన్స్ క్లియరెన్స్ కూడా ప్రయత్నించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతో పాటు 42 శాతం టిక్కెట్లు ఇస్తే ఎలా ఉంటుంది ? అనే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. మరోవైపు హైకోర్టు కూడా 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ దాటకూడదని తీర్పు ఇచ్చింది. పాత పద్ధతుల్లోనే వెళ్లవచ్చని స్పష్టంచేసింది. అంతేగాక 42 శాతం రిజర్వేషన్లు అమలు కు రాష్ట్రంలో ప్రత్యేక మైన పరిస్థితులు ఉన్నట్లు భావించి, 42 శాతాన్ని ఓపెన్ (ఉమెన్ రిజర్వేషన్ మినహాయించి) వెళ్లే ఛాన్స్ కూడా ఉన్నట్లు హైకోర్టు తీర్పు కాఫీలో పొందుపరచడం గమనార్హం. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా లీగల్ ఓపీనియన్లు సేకరిస్తున్నది. ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికీ లేఖ రాసినట్లు తెలిసింది.
Read Also- Lulu Mall Controversy: లులూ మాల్‌పై పవన్ కళ్యాణ్ కన్నెర్ర..! మద్దతుగా చంద్రబాబు స్పందన!
