Konda Surekha – Seethaka: మంత్రి సీతక్కతో రాజకీయ విభేదాలు గానీ, వ్యక్తిగత విభేదాలు లేవు… మరి ఎప్పుడు కూడా రావు అని మంత్రి కొండా సురేఖ(Min Konda Sureka) స్పష్టం చేశారు. మేము సమ్మక్క సారలమ్మ మాదిరి కలిసే ఉన్నాం.. కడదాకా నాది అదే వైఖరి అని తేల్చి చెప్పారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. నాడు భూస్వాముల పాలనలో ఓరుగల్లు ప్రాంతాన కప్పం కట్టమని అడిగిన ప్రతివాళ్ళకు కత్తిలాంటి జ్ఞాపకం సమ్మక్క-సారక్కలు అని, నేడు కారు పార్టీ నేతలు, కల్వకుంట్ల గడీలకు ఊడిగం చేసే అతి కొంతమందికి కలలో కూడా కలవరం తీసుకువచ్చేంతటి జ్ఞాపకాలు కొండా సురేఖ – సీతక్కలు అని వెల్లడించారు.
ఎందుకు అంత ఉత్సాహమో
రాష్ట్ర మంత్రి సీతక్క(Min Seethakka) నాకు ఒక చెల్లి, అక్కతో సమానం.. ఆమెతో నాది ఉద్యమాల పేగు బంధం.. అటువంటి మా ఇద్దరిపై అతి కొంతమంది మీడియా సోదరులు సంఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలని.. ఆ విధంగా వార్తలు రాస్తూ.. రాయించుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్న వైఖరి చాలా రోజులుగా చూస్తున్నానని తెలిపారు. గురువారం జరిగిన పరిణామాలు నిశితంగా పరిశీలించిన తర్వాత నాకు చాలా బాధేసిందని, మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలేనప్పుడు అతి కొంతమందికి ఎందుకు అంత ఉత్సాహమో నాకు అర్థం కావడం లేదన్నారు. సీతక్క(Seethakka) చెప్పినట్టు రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేని కొన్ని శక్తులను చూస్తున్నామన్నారు. పిత్రుస్వామిక వ్యవస్థలు వాళ్ళని పుత్రులు, మిత్రులు అని అనుకోవాలన్నారు.
Also Read: Red Rainbow: అరుదైన అద్భుతం.. సింగిల్ కలర్ రెడ్ రెయిన్‌బో.. భలే గమ్మత్తుగా ఉందే!
అప్పుడు నేను డెంగ్యూ జ్వరంతో
సొంత ఇంట్లో ఆడబిడ్డలను ఏకాకి చేస్తూ దృష్ట రాజకీయం చేస్తున్నవారు.. వారికి మీడియాలో వంత పాడుతున్న అతి కొంతమందిని చూస్తే నిజంగా జాలేస్తుందన్నారు. కొన్ని మీడియాలు మా మధ్య విభేదాలు సృష్టించాలని యత్నించడం సహేతుకం కాదన్నారు. గతంలో సమ్మక్కసారక్క జాతరకు నేను ఎందుకు రాలేదో వివరంగా చెప్పానని, అప్పుడు నేను డెంగ్యూ జ్వరంతో పడుతూ మీడియాకు వీడియో రిలీజ్ కూడా చేశానన్నారు. అది తెలిసిన తర్వాత కూడా కొన్ని మీడియాలు సీతక్కను అలా అడిగారంటే వారిది అక్కసు కాకపోతే ఏమనుకోవాలన్నారు. మహిళలుగా తామిద్దరం కలిసి ప్రజాసేవలో ఉంటే కొందరు జీర్ణించుకోలేక తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ రాష్ట్ర రాజకీయాల స్థాయికి ఎదగడం అంటే అతి సామాన్యమైన విషయం కాదని కొన్ని మీడియాలు గుర్తించాలని కోరారు.
Also Read: Edupayala Temple: జల దిగ్బంధంలోనే.. ఏడుపాయల వన దుర్గామాత ఆలయం
